పడక గదిలో మరో మహిళతో భర్త: ఆవేశంలో భార్య ఏం చేసిందంటే..?

Subscribe to Oneindia Telugu

టెక్సాస్: పడక గదిలో మరో మహిళతో ఉన్న భర్తను చూసిన ఆ మహిళ కోపాన్ని ఆపుకోలేకపోయింది. అమితంగా ప్రేమించే తన భర్త ఇలా చేయడంతో తుపాకీతో కాల్చుకోవాలని ప్రయత్నించింది. కళ్లు మూసుకుని తుపాకీతో కాల్చేసుకోగా.. బుల్లెట్ భర్తకు తగిలి అతడు మృతి చెందాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. డల్లాస్‌కు చెందిన షాజెట్టా జాక్సన్ పికెట్(41), సైనికాధికారి అయిన క్రిస్టార్ పికెట్(37) భార్య భర్తలు. కాగా, బయటికి వెళ్లి ఇంటికొచ్చిన జాక్సన్ తన భర్తను మరో మహిళతో పడకగదిలో సన్నిహితంగా ఉండగా చూసింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. తన భర్త తనను మోసం చేయడం తట్టుకోలేకపోయింది.

Texas woman shoots her husband over his alleged infidelity

ఈ వ్యవహారంపై భర్తను నిలదీసింది. భర్త ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఆమె తన కారులో వెంట తెచ్చుకున్న తుపాకీని బయటకు తీసింది.
తనను తాను కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించింది. కళ్లు మూసుకుని కాల్చేసుకుంది.

అయితే తుపాకీ బుల్లెట్ తనకు తగలకుండా భర్తకు తగిలింది. దీంతో భర్త అక్కడిక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. కాగా, కొంతకాలంగా వారిమధ్య గొడవలు జరుగుతున్నాయని, అందువల్ల వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ విషయం గురించి మాట్లాడేందుకే శుక్రవారం జాక్సన్, భర్త క్రిస్టార్‌ను కలిసేందుకు అతడు ఉంటున్న ఇంటికి వెళ్లింది.

ఆ సమయంలో అతడు మరో అమ్మాయితో అభ్యంతరకరంగా ఉండటంతో తట్టుకోలేక పోయిందని అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని చెప్పారు. అయితే జాక్సన్ తన భర్తను అమితంగా ప్రేమించేదని తెలిపారు. త్వరలోనే వారిద్దరూ కలిసి ఉంటారని ఆశించిన తమకు ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. జాక్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 41 year old Texas mother is facing murder charges after she shot her husband dead at his job during a confrontation about his alleged infidelity.
Please Wait while comments are loading...