బౌద్ధులపై లైంగిక వల-న్యూడ్ పిక్స్ తో బెదిరించి 102 కోట్ల వసూల్- థాయిలాండ్ కిలేడీ అరెస్టు..!
బౌద్ధ సన్యాసులను లైంగిక సంబంధాల్లోకి దించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ మహిళను థాయిలాండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
ఆసియా దేశం థాయిలాండ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. నిత్యం బుద్దుడి ధ్యానంలో మునిగితేలే బౌద్ధ భిక్షువులు, సన్యాసులు ఓ మహిళ వలలో పడ్డారు. ఆమెతో కలిసి సన్నిహిత సంబంధాలు నెరిపారు. వీరితో తీసుకున్న ఆ ఫొటోల్ని చూపి బెదిరించి వారి నుంచే 102 కోట్లు వసూలు చేసిందా కిలాడీ. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఆ మహిళను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
బౌద్ధ సన్యాసులను లైంగిక సంబంధాల్లోకి దించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ మహిళను థాయిలాండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. బౌద్ధ సన్యాసులు బ్రహ్మచర్యం పాటించాలనే నియమాన్ని ఉల్లంఘించడంతో ఈ వ్యవహారం ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయల్ థాయ్ పోలీస్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అందించిన వివరాల ప్రకారం ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న 9 మందికి పైగా మఠాధిపతులు, సీనియర్ సన్యాసులను పదవుల నుంచి తొలగించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. విలావన్ ఎమ్సావత్ అనే 30ఏళ్ల మహిళను పోలీసులు ఉత్తర బ్యాంకాక్ లోని నాన్‌థబురిలో ఉన్న తన విలాసవంతమైన ఇంటిలో అరెస్టు చేశారు. ఆమెపై దోపిడీ, మనీలాండరింగ్, దొంగిలించబడిన వస్తువులను తిరిగి దోపీడీ చేసిన ఆరోపణలు ఉన్నాయి. మిస్ గోల్ఫ్ గా పోలీసులు పిలుస్తున్న ఆమె.. కనీసం తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు వెల్లడించారు.
దర్యాప్తులో దొరికిన ఆమె ఫోన్లలో ఇతర బౌద్ధ నాయకులతో ఉన్న మెసేజ్ లు, వీడియోలు కూడాబయటపడ్డాయి. బ్లాక్‌మెయిల్ ద్వారా సంపాదించిన డబ్బును చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ జూదంలో ఆమె విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు కూడా గుర్తించారు. కొందరు సన్యాసులు ఈ విలావన్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించారని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ సన్యాసుల్ని సంప్రదించిన ఆమె.. వారికి డబ్బు, విలాసవంతమైన వస్తువుల ఆశచూపి లైంగికంగా వశపర్చుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫొటోలు కూడా తీసుకుంది. వీటి సాయంతో వారిని బెదిరించి 102 కోట్లు వసూలు చేసేసింది. తన ఇంటిలో అనేక మంది బౌద్ధ సన్యాసులతో లైంగిక చర్యల్లో పాల్గొన్న 80వేల ఫోటోలు, వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాలు విలావన్ ఎమ్సావత్ ఓ సన్యాసితో తనకు పిల్లలు కూడా ఉన్నారని విచారణలో తెలిపింది. ఆమె బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంతో బ్యాంకాక్‌లోని ఒక మఠాధిపతి సన్యాస జీవితం నుండి అర్ధాంతరంగా వైదొలిగాడు. దీంతో విచారిస్తే ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే మహిళలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాన్ని సవరించాలని ధాయిలాండ్ సెనేట్ కమిటీ ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications