వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాయ్‌లాండ్‌: ప్రీ స్కూల్‌లో మాజీ పోలీస్ అధికారి కాల్పులు, కనీసం 31మంది మృతి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

థాయ్‌లాండ్: డే కేర్ సెంటర్‌లో మాజీ పోలీస్ అధికారి కాల్పులు, కనీసం 31మంది మృతి

థాయ్‌లాండ్‌లో ఒక ప్రీస్కూల్ డే కేర్ సెంటర్‌లో ఓ మాజీ పోలీస్ అధికారి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో కనీసం 31మంది మరణించారని ఆ దేశ పోలీసులు వెల్లడించారు.

మరణించిన వారిలో కనీసం 23 మంది చిన్నారులు ఉన్నారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.

థాయ్‌లాండ్‌లోని నాంగ్ బువా లాంఫు నగరంలో జరిగిన ఈ ఘటన తర్వాత నిందితుడు తప్పించుకుని పారిపోయాడని పోలీసులు తెలిపారు.

https://twitter.com/PichayadaCNA/status/1577927541758648320

అయితే, గన్‌మాన్ తన భార్యా పిల్లలను కాల్చి చంపి, తాను కూడా కాల్చుకుని చనిపోయాడని థాయ్‌లాండ్ మీడియా తెలిపింది.

ఈ ఘటన బాధితుల్లో పెద్దవాళ్లతోపాటు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

పిల్లలు, పెద్దవాళ్ల మీద నిందితుడు కాల్పులు జరపడమే కాకుండా, వారిపై దాడికి కూడా పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

దాడికి వెనక కారణాలు ఇంకా తెలియరాలేదని వారు వెల్లడించారు.

నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తమ ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు. 34 ఏళ్ల పాన్య కమ్రాబ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని వారు వెల్లడించారు. కాల్పులు జరిపిన తర్వాత కమ్రాబ్ తన తెలుపు రంగు పికప్ ట్రక్ లో సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని వెల్లడించారు.

థాయ్‌లాండ్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Thailand: At least 31 people were killed in a shooting by a former police officer at a pre-school
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X