ఎంహెచ్ 17: టీనేజ్ కూతుర్ని కోల్పోయిన తండ్రి థ్యాంక్స్

కౌలాలంపూర్: మలేషియా విమానం ఎంహెచ్ 17 ప్రమాదంలో తన కూతురును పోగొట్టుకున్న ఓ డచ్ తండ్రి రష్యా అధ్యక్షులు వ్లాదిమర్ పుతిన్‌కు లేఖ రాశాడు. ఈ ప్రమాదంలో అతను తన ఒక్కగానొక్క పదిహేడేళ్ల కూతురును పోగొట్టుకున్నాడు. దీనిపై పుతిన్‌కు వ్యంగ్యంగా కృతజ్ఞతలు చెప్పాడు.

ఈ మేరకు తండ్రి ఓ బహిరంగ లేఖ రాశాడు. తన ముద్దుల కూతురు ఎల్స్ మిక్ (17)ను చంపిన పుతిన్, వేర్పాటువాద నాయకులు లేదా ఉక్రెయిన్ గవర్నమెంట్‌కు చాలా కృతజ్ఞతలని, హఠాత్తుగా ఆమె చనిపోయిందని, ఓ విదేశం చేసిన యుద్ధం వల్ల ఆకాశంలోనే విమానాన్ని కాల్చేశారని, వచ్చే ఏడాదిలో తన స్నేహితురాలు జూలియాతో తన కుమార్తె పాఠశాల విద్యను పూర్తి చేయనుందని అందులో పేర్కొన్నాడు.

'Thanks for murdering my child,' father tells Putin, MH17 attackers

తర్వాత డెల్ఫ్ విశ్వవిద్యాలయంలో ఆమె సివిల్ ఇంజినీరింగ్ చేయాలనుకుందని, అందుకు బాగా ఎక్సైట్ అయిందని, కానీ తన జీవితాన్ని నాశనం చేసినందుకు మీరు గర్వపడుతున్నారని అనుకుంటున్నానని, ఈ సందేశాన్ని త్వరలో మీరు (పుతిన్) తప్పక చదువుతారని, లేదా మీ సహాయకులు మీకు చెబుతారని అనుకుంటున్నాంటూ వ్యంగ్యంగా ఆ తండ్రి తన ఆవేదనను వెల్లడించాడు. ఈ లేఖను డచ్ మీడియా ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+