కన్న తల్లిని 30 సార్లు పొడిచి చంపింది

వాషింగ్టన్: తన ప్రేమను వ్యతిరేకిస్తున్నారన్న కారణంతో ఓ యువతి తన తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేసింది. అమెరికాలోని నార్తర్న్ విస్కాన్సిస్ కు చెందిన మార్టిన్ సన్ అనే యువతి తన తల్లిదండ్రులను హత్య చేసిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

తండ్రిని గన్ తో కాల్చి చంపింది. తల్లిని 30 సార్లు కత్తితో పొడిచి చంపిందని పోలీసులు అన్నారు. ఈ కేసు విచారణ కోర్టులో ఉందని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు గత సంవత్సరం నార్త్ విస్కాన్సిస్ పట్టణంలో మార్టిన్ సన్ తల్లిదండ్రుల శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మార్టిన్ సన్ తన బాయ్ ఫ్రెండ్ తో ఇండియానాకు పారిపోయింది. జంట హత్యలు ఎవ్వరు చేశారు అని పోలీసులు ఆరా తీశారు. కన్న కూతురే తల్లిదండ్రులను హత్య చేసిందా అని పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. మార్టిన్ సన్ కోసం గాలించారు.

 The Chilling case of a teen horr Blogger accused of killing her parents

చివరికి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తానే తన తల్లిదండ్రులను హత్య చేశానని మార్టిన్ సన్ నేరం అంగీకరించింది. తన బాయ్ ఫ్రెండ్ అంటే తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, తనను కలుసుకోరాదని తన బాయ్ ఫ్రెండ్ ను చాల సార్లు బెదిరించారని మార్టిన్ సన్ పోలీసుల విచారణలో చెప్పింది.

తనను ఇంట్లో బందీ చేశారని, బయటకు వెళ్లకుండా చిత్రహింసలకు గురి చేశారని, అందుకే చంపేశానని పోలీసుల ముందు అంగీకరించింది. ఈ హత్యలు జరగక రెండు రోజుల ముందు మర్టిన్ సన్ తన ఫేస్ బుక్ లో వెల్ కమ్ టూ హెల్ అని పోస్టు చేసినట్లు ఆమె స్నేహితులు చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో మార్టిన్ సన్ కు 120 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+