గ్యాంగ్ రేప్: ఆ నలుగురు కామాంధులకు ఉరి శిక్ష

ఇస్లామాబాద్: బాలికల మీద అత్యాచారం చేసిన నలుగురు కామాంధులకు పాకిస్థాన్ లో ఉరి శిక్ష విధించారు. మంగళవారం ఇద్దరిని, బుధవారం ఇద్దరిని ఉరి తియ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సలీమ్, నౌమన్ లను ఉరి తియ్యనున్నారు.

అదే విధంగా బుధవారం అబిద్ మసూద్, సనావుల్లాలను ఉరి తియ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ లోని సాయిల్కోట్ జిల్లా జైలులో వీరు నలుగురిని ఉరి తీస్తున్నారు. వీరు నలుగురు ఇద్దరు మైనర్ బాలిలక మీద గ్యాంగ్ రేప్ చేశారు.

the four convicts will be hanged at the Sialkot district jail

1999లో నౌమన్, సలీమ్ ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. ఇద్దరు పదేపదే అత్యాచారం చెయ్యడంతో బాలిక తీవ్రఅస్వస్థతకు గురైయ్యింది. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. బాలిక మీద అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు.

1997లో అబిద్ మసూద్, సనావుల్లా 15 సంవత్సరాల బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. పోలీసుల విచారణలో నిందితులు గ్యాంగ్ రేప్ చేసినట్లు వెలుగు చూసింది. ఇద్దరు నేరం అంగీకరించారు. వీరిద్దరిని ఏప్రిల్ 22 వ తేది బుధవారం ఉరి తీస్తున్నారు.

2014 డిసెంబర్ 16వ తేదిన పెషావర్ లోని ఆర్మి స్కూల్ మీద పడిన తాలిబన్ టెర్రరిస్టులు కాల్పులు జరిపి 150 మంది పిల్లలను పోట్టన పెట్టుకున్నారు. అప్పటి వరకు పాకిస్థాన్ లో ఉరి శిక్షపై నిషేధాన్ని ఎత్తి వేశారు. అప్పటి నుండి వివిద కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వెంటవెంటనే ఉరి శిక్ష అమలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+