ప్రపంచ వినాశనానికి సంకేతం రేపే!? అందరిలోనూ ఉత్కంఠ.. నక్షత్ర మండలం కనిపిస్తుందా?
ప్రపంచం అంతానికి సమయం ఆసన్నమైందని స్వయం ప్రకటిత పరిశోధకుడు డేవిడ్ మీడ్ చేస్తున్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నెల 23 నుంచి అందుకు సంకేతాలు వెలువడుతాయని ఆయన చెబుతున్నారు.
వాషింగ్టన్: ప్రపంచం అంతానికి సమయం ఆసన్నమైందని స్వయం ప్రకటిత పరిశోధకుడు డేవిడ్ మీడ్ చేస్తున్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నెల 23 నుంచి అందుకు సంకేతాలు వెలువడుతాయని ఆయన చెబుతున్నారు.
'క్రైస్తవ సంఖ్యా శాస్త్రవేత్త'గా చెబుతున్న ఈయన వాదనలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఖండిస్తోంది. డేవిడ్ సూత్రీకరణ ప్రకారం..
ప్రపంచ వినాశనాన్ని వివరించే బైబిల్ లోని 'ప్రకటన గ్రంథం'లో పేర్కొన్న విధంగా ఈ నెల 23న జెరుసలేంపైన ఆకాశంలో ఒక నక్షత్ర మండలం కనిపిస్తుంది. ప్రపంచ అంతానికి అదే సంకేతం.

అక్టోబర్ చివరినాటికి ఏడేళ్ల విపత్తు కాలం మొదలవుతుంది. ఈ కాలంలో వరుసగా పెను విపత్తులు భూమిని ముంచెత్తుతాయి. నిబీరు అనే ఒక గ్రహం.. భూమి వైపునకు దూసుకొస్తోంది. దీనివల్ల భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, రాకాసి అలలు విరుచుకుపడతాయి.
కొట్టిపారేస్తున్న నాసా...
మరోవైపు నిబీరు అనే గ్రహమేదీ లేదని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కొట్టిపారేసింది. అది భూమి దిశగా వస్తోందన్నది నిజం కాదని పేర్కొంది. ఆ గ్రహం మనుగడలో ఉంటే.. దాని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌర కుటుంబంలోని గ్రహాల కక్ష్యలు మారిపోతాయని వివరించింది. కానీ అలాంటి పరిస్థితేదీ ప్రస్తుతం లేదని నాసా పేర్కొంది.












Click it and Unblock the Notifications