Telangana Inter Exams: 2023 మార్చి 15 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు..
తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి రెండో తేదీ వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.

ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ చెప్పారు.

పరీక్ష ఫీజు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మంగళవారం నాడు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, మార్చి 2023 పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను సవరించింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 14 నుండి 17 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 పరీక్ష ఫీజు వరకు చెల్లించవచ్చు. పరీక్ష రుసుమును రూ.2,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 24 నుండి 28 వరకు చెల్లించవచ్చు.












Click it and Unblock the Notifications