Russia-Ukrain: కళావిహీనంగా మారిన బఖ్‌ముత్.. ఈ యుద్ధం ఆగేదేప్పుడో..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రముఖ నగరమైన బఖ్‌ముత్ రూపురేఖలు కోల్పోయింది. ఈ నగరంపై పట్టు సాధించినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. మాస్కో దీనిని ఒక పెద్ద విజయంగా ప్రకటిస్తోంది. బఖ్ ముత్ అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెనియన్ మిలిటరీ, రక్షణ అధికారులు నగరాన్ని పూర్తిగా కోల్పోలేదని బఖ్‌ముత్‌లోని కొన్ని భాగాలను తమ నియంత్రణలో ఉన్నాయని ప్రకటన చేశారు.
"మేము ఇప్పుడు బఖ్ముత్ లో కొంత భాగాన్ని నియంత్రించినప్పటికీ, దాని రక్షణ ప్రాముఖ్యత దాని ఔచిత్యాన్ని కోల్పోదు" అని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. రష్యా బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకుందని తాను భావించడం లేదని ఉక్రెనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఒకప్పుడు గులాబీలు, వైన్ నగరంగా పేరుగాంచిన బఖ్‌ముత్ ఇప్పుడు ఘోరంగా మారినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.

యుద్ధానికి ముందు బఖ్‌ముత్ జనాభా సుమారు లక్ష ఉండేదని.. పస్తుతం ఆ నగర జనాభా 3వేలక తగ్గినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. బఖ్‌ముత్ నాణ్యమైన వైన్ తయారీకి ఈ నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ నగరం కొంతకాలంగా రష్యా దురాక్రమణకు కేంద్ర బిందువుగా మారింది. బఖ్‌ముత్ లో ఎక్కడ చూసినా శిథిల భవంతులే కనిపిస్తున్నాయని పలువురు స్థానికులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఉప్పు-గనుల పట్టణందా పేరొందిన బఖ్‌ముత్ సుదీర్ఘమైన యుద్ధంలో రక్తపాతానికి వేదికైంది. రష్యా కైవ్ తో పాటు, బఖ్ ముత్ కూడా ఆధీనంలో తీసుకోడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యన్ దళాలు డాన్‌బాస్‌లోని మరిన్ని భాగాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఉక్రెయిన్ దళాలలు భావిస్తున్నాయి. ఏడాదికి పైగా జరుగుతున్న ఈ భీకర దాడుల్లో 20వేలనుంచి 30వేల మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. అటు ఉక్రెయిన్ కూడా భారీగా సైన్యాన్ని కోల్పోయింది.












Click it and Unblock the Notifications