Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాళ్ళకు బూట్లు వేసుకునే టైమ్ కూడా లేదు, ఖజానా చోరీ అబద్దం : యూఏఈలో ఉన్నా : అష్రఫ్ ఘనీ

ఆఫ్ఘనిస్థాన్ దేశ అధ్యక్షుడుగా ఉన్న అష్రఫ్ ఘనీ, ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకోవడంతో దేశాన్ని వదిలి పారిపోయాడు. ఆపై ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను వదిలి ఆయన తన స్వార్ధం కోసం పారిపోయాడని విమర్శించిన వారు లేకపోలేదు . అయితే ఆయన దేశాన్ని వదిలి పారిపోయే క్రమంలో పెద్ద ఎత్తున డబ్బుతో పారిపోయాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. రష్యన్ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇక తాజాగా మరోమారు ఆయనపై ఖజానా చోరీ ఆరోపణల నేపధ్యంలో ఆయనను అరెస్ట్ చెయ్యాలని తజకిస్తాన్ లోని ఆఫ్ఘన్ ఎంబసీ ఇంటర్ పోల్ పోలీసులను కోరనున్నట్టు వెల్లడించింది . అసలు ఆయన ఇంతకీ ఎక్కడ ఉన్నాడు అని చర్చ జరుగుతున్న సమయంలో అష్రఫ్ ఘనీ తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.

Recommended Video

    Former Afghan President Ashraf Ghani Fled With Cars, Chopper Full Of Cash, Claims Russia

     తనపై వచ్చిన ఖజానా చోరీ ఆరోపణలను ఖండించిన అష్రఫ్ ఘనీ

    తనపై వచ్చిన ఖజానా చోరీ ఆరోపణలను ఖండించిన అష్రఫ్ ఘనీ


    అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి 1255 కోట్లతో పరారయ్యాడని వచ్చిన ఆరోపణలపై ఆప్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆశ్రయం పొందానని, కేవలం రక్తపాతాన్ని నివారించటం కోసమే తాను దేశాన్ని వదిలి రావాల్సి వచ్చిందని అష్రఫ్ ఘనీ స్పష్టం చేశారు. తాలిబన్లకు మరియు మాజీ అధికారులకు మధ్య చర్చలకు తాను మద్దతు ఇస్తున్నానని పేర్కొన్న ఆయన తిరిగి ఆఫ్ఘనిస్థాన్ రావడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

     దేశ శ్రేయస్సు కోసం, రక్తపాతాన్ని నివారించటం కోసమే దేశాన్ని వదిలి వచ్చా

    దేశ శ్రేయస్సు కోసం, రక్తపాతాన్ని నివారించటం కోసమే దేశాన్ని వదిలి వచ్చా

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయే ముందు దేశం నుండి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకువెళ్లానన్న ఆరోపణలను ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఖండించారు. దేశ శ్రేయస్సు కోసం తాను దేశం విడిచిపెట్టానని, తన క్షేమం కోసం కాదని ఘనీ తన వాదన వినిపిస్తున్నాడు. మీ అధ్యక్షుడు మిమ్మల్ని అమ్మి, తన స్వలాభం కోసం మరియు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడని ఎవరు చెప్పినా నమ్మవద్దు అని ఆయన అన్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అష్రఫ్ ఘనీ వెల్లడించారు.

     కనీసం కాళ్ళకున్న చెప్పులు తీసి బూట్లు వేసుకునే అవకాశం కూడా లేని స్థితిలో వచ్చానని స్పష్టం

    కనీసం కాళ్ళకున్న చెప్పులు తీసి బూట్లు వేసుకునే అవకాశం కూడా లేని స్థితిలో వచ్చానని స్పష్టం

    తాను ఆఫ్ఘనిస్తాన్ నుండి బహిష్కరించబడ్డానని, కనీసం కాళ్ళకు చెప్పులు తీసి బూట్లు వేసుకునే అవకాశం కూడా తనకు లభించలేదని, తాను ఎమిరేట్స్‌ కు ఖాళీ చేతులతో వచ్చానని పేర్కొన్నారు.తాలిబాన్ ఉద్యమానికి చెందిన సీనియర్ సభ్యులు, ఘనీ పూర్వీకుడు హమీద్ కర్జాయ్ కు , చివరికి విఫలమైన శాంతి ప్రక్రియకు నాయకత్వం వహించిన అబ్దుల్లా అబ్దుల్లా మధ్య బుధవారం జరిగిన చర్చలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నానని ఘనీ చెప్పాడు.

    స్వదేశానికి తిరిగి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నానన్న అష్రఫ్ ఘనీ

    స్వదేశానికి తిరిగి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నానన్న అష్రఫ్ ఘనీ

    తనకు గల్ఫ్ దేశంలో ప్రవాసంలో ఉండాలనే ఉద్దేశం లేదని ,స్వదేశానికి తిరిగి రావడానికి చర్చలు జరుపుతున్నానని చెప్పాడు. అంతేకాదు మన దేశంపై ఆఫ్ఘన్ పాలనను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా అష్రఫ్ ఘనీ వెల్లడించారు.తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించమని అంగీకరించినప్పటికీ వారు ప్రవేశించారని ఆయన పేర్కొన్నారు. తాను నిస్సహాయ స్థితిలో దేశం వదిలి వచ్చానని , కేవలం ఆఫ్ఘన్ ప్రజలను రక్తపాతం నుండి తప్పించేందుకే తాణీ నిర్ణయం తీసుకున్నానని అష్రఫ్ ఘనీ వెల్లడించారు .తాను కచ్చితంగా స్వదేశానికి వస్తానని ఆయన అన్నారు.

    తాను అక్కడే ఉంటే ఉరి తీసేవారన్న అష్రఫ్ ఘనీ

    తాను అక్కడే ఉంటే ఉరి తీసేవారన్న అష్రఫ్ ఘనీ

    తాను ఆ సమయంలో అక్కడ ఉండి ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడిని ఆఫ్ఘన్ కళ్ల ముందే ఉరితీసేవారు అని ఆయన అన్నారు. రెండు మార్లు తనను ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. 1996 లో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, వారు తమ కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నజీబుల్లాను ఆశ్రయం పొందిన ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుండి తీసుకు వచ్చి మరి అతడిని హింసించిన తర్వాత బహిరంగంగా ఉరితీశారన్న విషయాన్ని గుర్తు చేశారు.

     యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లో తలదాచుకున్న ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు .. ధ్రువీకరించిన యూఏఈ

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లో తలదాచుకున్న ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు .. ధ్రువీకరించిన యూఏఈ

    అష్రఫ్ ఘనీ తాలిబాన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ఆదివారం కాబూల్ నుండి ప్రెసిడెంట్ భవనం నుండి పారిపోయినట్టు, ఆయన తజకిస్తాన్ వెళ్ళినట్లుగా మొదట ప్రచారం జరిగింది . అయితే ప్రస్తుతం ఆయన యూఏఈ లో ఉన్నట్టుగా వెల్లడించారు. మానవతా దృక్పథంతో యూఏఈ తనకు ఆశ్రయం ఇచ్చిందని చెప్పారు. ఇక ఈ విషయాన్ని యూఏఈ కూడా నిర్ధారించింది. అయితే ఆయన ఎక్కడున్నాడు అనే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు.

    రెండు మార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన అష్రఫ్ ఘనీ .. దేశద్రోహి అంటున్న ప్రత్యర్థులు

    రెండు మార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన అష్రఫ్ ఘనీ .. దేశద్రోహి అంటున్న ప్రత్యర్థులు

    విద్యావేత్త మరియు ఆర్థికవేత్త అయిన అష్రఫ్ ఘని ఆఫ్ఘనిస్తాన్ 14 వ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను మొదట సెప్టెంబర్ 20, 2014 న ఎన్నికయ్యారు . ఆ తర్వాత సెప్టెంబర్ 28, 2019 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. ఇక అష్రఫ్ ఘనీ దేశ ద్రోహి అని, ఖజానా చోరీ చేసి పారిపోయాడని, చిరకాల ప్రత్యర్థి అయిన అబ్దుల్లా- మాజీ అధ్యక్షుడు ఘనీ కఠినంగా శిక్షించబడతారని వెల్లడించారు. అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోవటం, ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి పడేలా చేశాయి. ఒక దేశ అధ్యక్షుడి పరారీ ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశం అయ్యింది. అష్రఫ్ ఘనీ విషయంలో ముందు ముందు తాలిబన్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+