అపరిచితుడు: నేరం చేస్తే వస్తాడు, కొడతాడు, మాయమౌతాడు!

Posted By:
Subscribe to Oneindia Telugu

మాస్కో: సమాజంలో దుష్టశక్తులను చీల్చి చెండాడే ఘటనలను మనం సినిమాలలో చూస్తుంటాం. హీరోలు మారువేషాల్లో వచ్చి విలన్లను చితక్కొడుతుంటారు. అపరిచితుడు సినిమాలో వలే.. అచ్చం అలాంటి సంఘటననే రష్యాలోని మాస్కో శివారు కిమ్కి ప్రాంతంలో జరిగింది.

ఇందుకు సంబంధించి ఓ ట్యాక్సీ డ్రైవర్ వివరాలు తెలిపాడు. ఈ సంఘటన జూన్ నెలలో జరిగింది. ఓ వ్యక్తి ముసుగు ధరించి వచ్చాడని, నేరస్తులను చితకబాదాడని, ఆ తర్వాత పోలీసులు ఆలస్యంగా వచ్చారని, నేరస్తులను అదుపులోకి తీసుకున్నారని సదరు డ్రైవర్ చెప్పాడు.

దీంతో, ఒక్కసారిగా ఆ ముసుగు వ్యక్తి అక్కడ పాపులర్ అయ్యాడు. కిమ్కి బ్యాట్‌మ్యాన్ అని పిలుస్తున్నారు. రష్యాకు చెందిన ఓ పత్రిక ఈ విషయంపై పరిశోధన మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా సదరు ముసుగు వ్యక్తి పోలీసులకు రాసిన ఓ లేఖను సంపాదించింది. ఆ లేఖ ప్రకారం.. డ్రగ్ మాఫియాతో పాటు స్థానిక నేరగాళ్లపై వన్ మ్యాన్ ఆర్మీలా యుద్ధం చేస్తానని సదరు కిమ్కి బ్యాట్‌మ్యాన్ ప్రకటించాడు. తనను రీపర్-మానవత్వానికి మొదటి హీరో అని అభివర్ణించుకున్నాడు.

నేర సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసేందుకు సాయం చేయాలని పోలీసులను కోరాడు. సోషల్ మీడియా ద్వారా తనకు సమాచారం అందించాలన్నాడు. తాను పోలీసులకు వ్యతిరేకం కాదని, పోలీసుల చేతులు బంధించి ఉన్నాయని తనకు తెలుసునని, సహచరుల వల్ల, నేరగాళ్ల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్లలేరని, కానీ నేను అక్కడికి వెళ్లి వారి వ్యవస్థలను నాశనం చేస్తానని, తనకు పేరు ప్రఖ్యాతులు వద్దని, సమాచారం మాత్రమే కావాలని, నేరగాళ్లు, రేపిస్టులు, డ్రగ్స్ మాఫియాదారుల సమాచారం తనకు కావాలని ఆ లేఖలో పేర్కొన్నాడు.

నేరగాళ్ల గురించి తనకు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చునని 'అపరిచితుడు' సినిమాలో వలె ట్విట్టర్ పేజీ అకౌంట్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ 40 మంది నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించానని చెప్పాడు. ఆ ట్విట్టర్ అకౌంటులోకి వెళ్తే.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ఉంటుందట.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There’s a guy outside Moscow who dresses up as Batman and beats up drug dealers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి