చైనా కోవిడ్ వ్యాక్సిన్ .. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ .. ధర చూస్తే బెదిరిపోవాల్సిందే!!
కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాలు పోటీపడి మరీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వి పేరుతో కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించి మూడవ దశ ట్రావెల్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక ఇదే సమయంలో అసలు కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా కూడా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. అయితే చైనా తయారుచేసే కరుణ వ్యాక్సిన్ను కొనుగోలు చేయడం ప్రపంచానికి కాస్త భారమే. దాని ధర ఎక్కువగా ఉండడమే అందుకు కారణం.
మూడో దశ ట్రయల్స్ కు రష్యా రెడీ: వచ్చే వారమే 40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగం

వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ దేశాల పోటీ
ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేటట్లు చేయాలన్న లక్ష్యంతో చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి . అంటే వాటికోసం ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఎదురుచూస్తున్నారు. కొనుగోలుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి మాత్రం ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. అందుకు కారణం అందుబాటు ధరలో లేకపోవడమే అని తెలుస్తుంది.

ఈ ఏడాది చివరి వరకే మార్కెట్ లో వ్యాక్సిన్
చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ సినోఫార్మ్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి ప్రజల ఉపయోగం కోసం సిద్ధంగా ఉండవచ్చని తెలుస్తుంది . అయితే ఇది 2021 లో అందుబాటులోకి వస్తుందని మునుపటి అంచనా కంటే ముందుగానే మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.సినోఫార్మ్ చైర్మన్ లియు జింగ్‌జెన్ మాట్లాడుతూ చివరి దశలో క్లినికల్ ట్రయల్స్ ను మూడు నెలల్లో పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

చైనా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ధర 1000 యువాన్లలోపే, ఇండియన్ కరెన్సీలో 10వేలకు పైనే
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఒక మహమ్మారిపై పోరాడటానికి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రపంచ రేసులో ఎదుర్కొంటున్న కొన్ని అడ్డంకులను అధిగమించి తాము ముందుకు వెళ్ళామని లియు జింగ్‌జెన్ పేర్కొన్నారు .చైనా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ధర 1000 యువాన్లలోపే ఉంటుందని పేర్కొన్నారు .అమెరికా కరెన్సీ లో దాదాపు 144 డాలర్లు .మన భారత కరెన్సీ ప్రకారం 10791 రూపాయలు .

చైనాతో పోల్చుకుంటే తక్కువ ధరలకే చాలా కంపెనీల వ్యాక్సిన్ లు
చైనా వ్యాక్సిన్ తో పోల్చుకుంటే అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 237 డాలర్ల ధర ఉంటుంది .అది ఇండియన్ కరెన్సీ లో 2773 రూపాయలు మాత్రమే ఉంటుంది . ఇక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ ధర రెండు డోసులు కలిపి 6 డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అది ఇండియన్ కరెన్సీ లో చూస్తే కేవలం 550 రూపాయలు మాత్రమే .భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కో వ్యాక్సిన్ ధర మిగతా అన్నిటి కంటే తక్కువగా ఉంటుందని ఆ సంస్థ ఎండి కృష్ణ ఎల్లా ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.