వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో... ఆ కరోనా వ్యాక్సిన్‌తో 73 సైడ్ ఎఫెక్ట్స్ అట..వెల్లడించిన వ్యాక్సిన్ నిపుణుడు

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనావైరస్‌కు జన్మనిచ్చిన చైనా ప్రస్తుతం ఆ వ్యాధి విరుగుడుకు వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే సైనోఫార్మ్ తీసుకొచ్చిన కరోనావైరస్ వ్యాక్సిన్‌ పై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాక్సిన్‌ అని అదే చైనాకు చెందిన డాక్టర్ చెప్పుకొచ్చారు. సైనో ఫార్మ్ కంపెనీ నుంచి వచ్చిన కరోనావ్యాక్సిన్‌తో 73 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని డాక్టర్ తావ్‌ లినా చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డాక్టర్ తావ్ లినా వెల్లడించారు.

చైనాలో పాపులర్ అయిన సోషల్ మీడియా వెబోపై తావ్ లినా అనే ఈ వ్యాక్సిన్ నిపుణుడు సైనో ఫార్మ్ వైరస్ గురించి చర్చించారు. ఇది సురక్షితం కాదని ఆయన స్పష్టం చేశారు. సైనో ఫార్మ్ ప్రభుత్వ రంగ సంస్థ. సైనో ఫార్మ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోగానే ఇంజెక్షన్ తీసుకున్న ప్రాంతంలో నొప్పి, ఆ తర్వాత తలనొప్పి, అధిక రక్తపోటు, కంటి చూపు కోల్పోవడం, రుచిని పసిగట్టలేకపోవడం, యురినరీ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అయితే ఈ డాక్టర్ తావ్ లినా చెప్పిన విషయాలన్నీ వైరల్ కావడంతో ఆయన దేశానికి క్షమాపణ చెప్పి ఆ వెంటనే తన పోస్టును డిలీట్ చేసినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది.

This Chinese doctor says that state run sinopharma covid vaccine is unsafe,has side effects

ఇదిలా ఉంటే ఈ డాక్టరు చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది చైనా ప్రభుత్వం. తమ ప్రభుత్వ న్యూస్ ఛానెల్ గ్లోబల్ టైమ్స్‌ ద్వారా మరో కథనం ప్రచురణ చేసింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితమని పేర్కొన్నాయి. డాక్టరు తాయ్ లినా చెప్పిన వ్యాఖ్యలను వీఓఏ అనే మరో న్యూస్ వెబ్‌సైట్ వక్రీకరించి పూర్తిగా అసత్యకథనంను ప్రచురించిందని పేర్కొంది. డాక్టర్ లినా సైనోఫార్మ్ వ్యాక్సిన్ గురించి తమాషా చేస్తే ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని ఆ వార్తా వెబ్‌సైట్ కథనాలు రాసుకొచ్చిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఇదిలా ఉంటే వీబో పై తన కామెంట్స్‌ను పోస్టుచేసిన డాక్టర్ లినా.. ఆ తర్వాత వాటిని తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి సైనోఫార్మ్ వ్యాక్సిన్ పై డాక్టర్ లినా సంచలన వ్యాఖ్యలు చేయడం.. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం... ఆ తర్వాత ఆ పోస్టును తొలగించడం వంటివి చూస్తే తెరవెనక ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి వచ్చిన ఈ వ్యాక్సిన్‌ పైనే అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వ మీడియా ఖండించడం వంటివి చూస్తుంటే ఈ వ్యాక్సిన్‌పై నిజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

English summary
A Chinese doctor said on social media that the Covid vaccine from the state run Sinopharma is unsafe and it shows 73 side effects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X