Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌తో ఇరాన్ సుప్రీం లీడర్ "ఖమేనీ"కి ఉన్న ప్రత్యేక సంబంధం ఇదే !!

ఇరాన్ సర్వాధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. 1989లో సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టిన ఖమేనీ, ఇరాన్‌లో అత్యున్నత అధికారిగా వ్యవహరించారు. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించారు. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించింది.

ఖమేనీ కుటుంబ మూలాలు భారత్‌లోనే?

కాగా ఖమేనీ కుటుంబ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా కింతూర్ గ్రామానికి చెందినవని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 19వ శతాబ్దంలో భారతదేశంలో జన్మించి, తరువాత ఇరాక్‌లోని నజాఫ్‌కు వలస వెళ్లినట్లు పేర్కొంటారు. ఇరాన్ అధికారిక పత్రాల్లో 'హిందీ' అనే పదాన్ని తన పేరుతో కొనసాగించడం ద్వారా ఖమేనీ తన భారత మూలాలను గుర్తుచేసుకున్నారని స్థానికులు భావిస్తుంటారు. ఈ అంశం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆయనకు ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకువచ్చింది.

this-is-the-special-relationship-that-irans-supreme-leader-khamenei-has-with-india

'మినీ ఇరాన్'గా అలీపుర్ ??

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా అలీపుర్ గ్రామంలో దాదాపు 90 శాతం మంది షియా ముస్లింలే నివసిస్తున్నారు. ఇరాన్‌తో ఈ గ్రామానికి దశాబ్దాలుగా ఉన్న సాంస్కృతిక, మత సంబంధాల కారణంగా దీనిని స్థానికంగా 'మినీ ఇరాన్'గా పిలుస్తారు. గ్రామంలోని అనేక కుటుంబాలకు ఇరాన్‌తో ప్రత్యక్ష అనుబంధాలు ఉన్నాయి. కొంతమంది విద్య, ఉపాధి కోసం ఇరాన్‌, దుబాయ్ వంటి దేశాల్లో స్థిరపడ్డారు. ఖమేనీ మరణంతో ఈ గ్రామంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఖమేనీ భారత్ పర్యటన..

1986లో ఖమేనీ భారత్‌ను సందర్శించిన సమయంలో అలీపుర్ గ్రామానికీ విచ్చేశారు. ఆ సందర్శన సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై మతపరమైన, సామాజిక అంశాలపై ప్రసంగించారు. అనంతరం ఇరాన్ ప్రభుత్వ సహకారంతో గ్రామంలో ఒక ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ఇప్పటికీ ఇరాన్‌కు చెందిన ఏజెన్సీల ఆర్థిక సహకారంతోనే నడుస్తుండటం విశేషం. గ్రామ ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి, ఖమేనీతో గ్రామానికి ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.

చిక్కబళ్లాపుర ప్రాంతం నుంచే సుమారు 150 మంది విద్యార్థులు దుబాయ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్‌, పశ్చిమాసియా దేశాలతో విద్యా సంబంధాలు కొనసాగుతుండటం వల్ల ఈ ప్రాంతానికి అంతర్జాతీయ అనుబంధం పెరిగింది. ఖమేనీ మరణంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు కూడా సంతాప సందేశాలు పంపినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఇక ఇప్పటికే ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిరసనలు, సంతాప సూచనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని దేశాల్లో అమెరికా వ్యతిరేక ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+