చనిపోయిన ప్రియుడితో పిల్లల్ని కనాలని!: కోర్టు గ్రీన్ సిగ్నల్, ఆస్ట్రేలియా యువతి ప్రేమకథ..

Subscribe to Oneindia Telugu

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన ఐలా అనే యువతి ప్రేమ కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రియుడు డేవిస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆమె కలలన్ని తుడిచిపెట్టుకుపోయాయి.

అయితే అక్కడితో ఆమె కుంగిపోలేదు. తాను ప్రేమించిన వ్యక్తి చనిపోయినా సరే.. అతని ద్వారా పిల్లలను కనాలనుకుంది. మృతి చెందిన వ్యక్తితో పిల్లలు కనడం సాధ్యమేనా? అని ఆమె వెనుకగడుగు వేయలేదు. ఐవీఎఫ్ పద్దతిలో కృత్రిమ గ‌ర్భ‌దార‌ణ ద్వారా పిల్లలను కనాలనుకుంది.

this woman chose to have children with their dead lover's sperm

ఇందుకోసం డేవిస్ వీర్యంతో పిల్లలను కనేందుకు అనుమతించాలని కోరుతూ అక్కడి కోర్టుకు తెలియజేసింది. కాగా ఐవీఎఫ్ పద్దతిలో కృత్రిమ గ‌ర్భ‌దార‌ణ విధానం (ఐవీఎఫ్‌) ద్వారా ఓ క్లినిక్‌ లో ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని న్యాయస్థానం కూడా అనుమతినిచ్చింది. దీంతో ఐలా కోరిక నెరవేరనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The woman was devastated when her beloved husband died unexpectedly in road accident,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి