• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీది ఏమీ ప్రేమ గురూ.. 100 పేజీలతో ఘాటుగా లేఖ: భారత సంతతీ యువకుడికి శిక్ష

|
Google Oneindia TeluguNews

ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులు ఆగడం లేదు. ఏ దేశంలో అయినా హరాస్ మెంట్ తప్పడం లేదు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీలో యువతికి వేధించాడు. అయితే అతను భరత సంతతికి చెందిన వ్యక్తి కావడం కాస్త ఇబ్బందికరంగా మారింది. సాహిల్ భవ్నానీ ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో.. నర్సింగ్‌ విద్యార్థిని వేధించాడు. దీంతో అతని వర్సిటీ నుంచి బహిష్కరణ శిక్షకు గురయ్యాడు.

సాహిల్‌కు కాలేజ్‌లో కిందటి ఏడాది ఆ యువతితో పరిచయం అయ్యింది. లవ్‌ ప్రపోజ్‌ చేస్తే.. యువతి ఒప్పుకోలేదు. ఓ రోజు ఆరు నిమిషాల వాయిస్‌ సందేశం పంపించాడు. ఆ వాయిస్‌ సందేశంలో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని, పిల్లలను కని సంతోషకరమైన జీవితం గడుపుదామని కోరాడు. ఆమె ససేమీరా అంది. అక్కడితో ఆగకుండా వంద పేజీల లేఖతో ఓ బెదిరింపు లేఖను కొరియర్‌ చేశాడు. దీంతో ఆమెలో భయం మొదలైంది. ఆపై తన స్నేహితులతోనూ లొంగిపోవాలని, లేకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయని ఆమెను బెదిరించాడు.

‘Threats in 100-page letter’: Indian-origin student expelled from UK university for stalking

లైంగిక దాడికి పాల్పడతాడనే భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. వెంటపడి వేధించిన నేరం ఒప్పుకోవడం, యువతికి నిందితుడు ఎలాంటి హాని చేయలేదనే వాదనతో శిక్ష మోతాదును ఆక్స్‌ఫర్డ్‌ క్రౌన్‌ కోర్టు తగ్గించింది. తన నేరాన్ని ఒప్పుకున్న సాహిల్‌.. మూడు నెలలపాటు గూగుల్‌లో కవితలను చదివి.. ఆ పై ఆ వంద పేజీల ప్రేమ లేఖను సిద్ధం చేశాడట!.

కిందటి నెలలోనే ఈ కేసులో వాదనలు పూరైనప్పటికీ.. తీర్పు ఆలస్యంగా వెలువడుతుందని అనుకున్నారు. భవ్నానీ శనివారం తన తండ్రితో కలిసి హాంకాంగ్‌కు వెళ్తున్నాడనే సమాచారం తెలియడంతో న్యాయమూర్తి నిగెల్ డాలీ ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో తీర్పును ప్రకటించారు. ఇప్పటికైనా ఆ అమ్మాయి వెంటపడవనే అనుకుంటున్నా అని జడ్జి భవ్నానీని ఉద్దేశించి సున్నింతగా మందలించారు. యూకే యూనివర్సిటిల్లో విద్యార్థినులపై వేధింపుల ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి.

English summary
Indian-origin student found guilty of stalking by a UK court has been handed a suspended sentence and is to leave for Hong Kong after his university expelled him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X