తనిఖీల పేరిట అవమానం: టిమ్ కుక్‌కు ఉద్యోగులు

యాపిల్ రిటైల్ స్టోర్లలో సెక్యూరిటీ పరమైన జాగ్రత్తల పేరుతో ఉద్యోగులను తనిఖీ చేయడం, వారి బ్యాగులను సైతం చెక్ చేస్తుండటంపై రెండు యాపిల్ స్టోర్లకు చెందిన ఉద్యోగులు సంస్ధ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్‌కు లేఖ రాశారు.

ఈ తనిఖీలు తమను కించపరిచే విధంగా ఉన్నాయని, ఈ చర్యలను తాము అవమానకరంగా భావిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. 2013లో ఫైల్ చేసిన ఓ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ లేఖను బహిర్గతం చేశారు.

యాపిల్ స్టోర్ మేనేజర్లు ఉద్యోగస్తులను క్రిమినల్స్‌ మాదిరిగా చూస్తున్నారని వారు ఆ లేఖలో ఆరోపించారు. దీంతో టిమ్ కుక్‌కు అందిన లేఖను హెచ్‌ఆర్ విభాగానికి చెందిన అధిపతికి పంపించి 'ఇది నిజమా?' అని ప్రశ్నించారు.

Tim Cook received complaints on Apple's bag check policy

అయితే హెచ్‌ఆర్ విభాగం నుంచి టిక్ కుక్‌కు వెళ్లిన సమాధానం మాత్రం తెలియలేదు. అమెరికాలోని రెండు యాపిల్ స్టోర్లలో పనిచేస్తోన్న ఉద్యోగులు తనిఖీలు చేసినందుకు గాను తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసు కాలిఫోర్నియాలోని ఉత్తర కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు వేసిన అమండా ఫ్రైకిన్, డీన్ పీల్లే మాట్లాడుతూ భోజన సమయ విరామాల్లో కూడా తమపై సేల్స్ విభాగం వ్యక్తులు తనిఖీలు నిర్వహించే వారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+