షాకింగ్: చిన్ననాటి ఫ్రెండ్‍‌ను పెళ్లి చేసుకున్న టాప్ బౌద్ధ సన్యాసి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టిబెట్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి థాయే డోర్జే (33) అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన సన్యాసం వదిలేసి భారత్‌లోని తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నారు.

మార్చి 25న ఢిల్లీలో డోర్జే వివాహం జరిగిందని, ఆయన సన్యాసం వదిలేశారని ఆయన కార్యాలయం షాకింగ్ ప్రకటన చేసింది. డోర్జే సీనియర్‌ టిబెటియన్‌ లామా. తాను టిబెట్‌లోని నాలుగు ప్రముఖ బౌద్ధ పాఠశాలల్లో ఒకదాని నాయకుడైన కర్మప లామా పునర్జన్మ అని చెప్పేవారు. దీనిపై అక్కడి బౌద్ధ సన్యాసుల్లో సందిగ్ధత ఉంది.

Top Tibetan Lama Abandons Monkhood To Marry Old Friend In India

అయితే ఆయన బౌద్ధ పాఠశాలలో కొందరు మరో సన్యాసిని అనుసరిస్తున్నారు. ఈ సమయంలో డోర్జే తాను సన్యాసం వదిలేస్తున్నానని ప్రకటించారు. డోర్జే సతీమణి 36 ఏళ్ల రించెన్‌ యాంగ్జోమ్‌. ఆమె భూటాన్‌లో జన్మించారు.

భారత్‌, యూరప్‌లలో చదువుకున్నారని ప్రకటనలో తెలిపారు. తన నిర్ణయం తనపై సానుకూల ప్రభావమే చూపుతుందని బలంగా నమ్ముతున్నానని డోర్జే పేర్కొన్నారు. డోర్జే టిబెట్‌లోనే జన్మించారు. ఆయన తండ్రి కూడా లామా.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A senior Tibetan lama at the centre of a long-running row over one of Buddhism's most important titles has abandoned the monkhood altogether after marrying a childhood friend in India, his office said Thursday.
Please Wait while comments are loading...