షాక్: పాక్ ట్రెండింగ్స్‌లో కేజ్రీవాల్ టాప్, తర్వాతే షరీఫ్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ మీడియాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ తన ప్రాధాన్యత పెంచుకున్నారు. భారత్ జరిపిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పాక్ మీడియా కేజ్రీవాల్‌ను హీరోగా పేర్కొంటూ వరుస కథనాలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్‌లో కూడా పాకిస్థాన్‌లో ట్రెండింగ్‌గా కొనసాగుతున్నారు కేజ్రీవాల్. అంతేగాక, కేజ్రీవాల్ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా ట్రెండింగ్‌లో మించి పోవడం విశేషం.
మనదేశంలో మాత్రం కేజ్రీవాల్‌పై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కేజ్రీని ప్రముఖులతోపాటు నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అంతేగాక, కేజ్రీవాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఓ వ్యక్తి.. ఆయనపై సిరా దాడి కూడా చేశాడు.

మనదేశంలో ఇలా ఉంటే.. తమకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు పాకిస్థానీయులు. అంతేగాక, ఈ రోజు కేజ్రీవాల్ పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారని కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం
భారతదేశంలో నిజాయితీపరుడు కేజ్రీవాల్ ఒక్కరేనంటూ అటు పాక్ మీడియాల్లోనూ, ఇటూ అక్కడి సోషల్ మీడియాల్లోనూ ప్రశంసలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications