నదిలో పడిపోయిన బస్సు..14 మంది మృతి..!
ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం. భారత్‌కు చెందిన ఈ బస్సు 40 మంది ప్రయాణికులతో పోఖరా నుంచి ఖాట్మాండుకు వెళుతుండగా మర్స్యాంగ్ది నదిలో పడిపోయింది. ఈ ఘటన అంబుఖైరేనిలోని ఐనాపహారాలో చోటు చేసుకుంది. బస్సు ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ (UP 53 FD 7623) కలిగి ఉంది.
ఇప్పటి వరకు గాయపడిన 16 మందిని కాపాడినట్లు కాస్కీ పోలీస్ చీఫ్ ఎస్పీ మోహన్ తెలిపారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. పోఖ్రాలోని మఝేరీ రిసార్ట్‌లో సమయం గడిపి ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఖాట్మాండుకు బయలు దేరిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసు బృందం ప్రయాణికులు బసచేసిన రిసార్టుకు చేరుకుంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications