మూడు వైపుల సంక్షోభం.. గడ్డు పరిస్థితిలో పాకిస్తాన్!
Pakistan: భారత్‌కు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ప్రస్తుతం ఓ సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ "వార్ ట్రయాంగిల్"లో చిక్కుకుంది. ఇక్కడ ప్రతి అడుగులోనూ దానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌తో విందు కోసం వెంపర్లాడుతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు సోదరభావంతో ఉన్న తాలిబాన్‌తో కూడా తీవ్ర శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నారు.
మూడు వైపులా దెబ్బ తింటున్న పాకిస్తాన్
2025లో పాకిస్తాన్ ప్రచార యుద్ధం పూర్తిగా విఫలమవుతోంది. పాకిస్తాన్ పదేపదే ఇస్లామిక్ 'ఉమ్మా' పేరు చెప్పి తాలిబాన్, బలూచిస్తాన్‌లను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ దాని ఎజెండా ప్రతిసారీ విఫలమైంది. ఈ ఏడాది పాకిస్తాన్ మూడు వైపుల నుంచి దెబ్బ తింటోంది. తన చర్యల ద్వారా మూడు వైపుల నుంచి యుద్ధ పరిస్థితిని సృష్టించింది.

*తూర్పున: భారత్‌తో తీవ్ర ఉద్రిక్తతలు.
*పశ్చిమ సరిహద్దులో: ఆఫ్ఘన్ తాలిబాన్‌తో భీకర ఘర్షణ. తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన డజన్ల కొద్దీ సైనికులను చంపి, అనేక పోస్టులను ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది.
*నైరుతిలో: బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల తిరుగుబాటుతో పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా అలసిపోయింది.
పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (PICSS) ప్రకారం.. జనవరి నుంచి సెప్టెంబర్ 2025 వరకు హింసాత్మక సంఘటనలు 2024 మొత్తం సంవత్సరంలో జరిగిన వాటితో సమానమయ్యాయి. ఈ సమయంలో 500 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. వందలాది మరణాలు నమోదయ్యాయి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో పాకిస్తాన్ రెండో స్థానానికి చేరుకుంది.ఈ యుద్ధ త్రికోణం పాకిస్తాన్ భద్రతా విధానాన్ని కదిలించడమే కాకుండా, దాని అంతర్గత రాజకీయ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
తాలిబాన్‌తో శత్రుత్వం
ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తమ సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తుందని పాకిస్తాన్ ఆశించింది. 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ తన సోదరులకు స్వాగతం పలికింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది. తాలిబాన్ పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును నిర్ణయించే డ్యూరాండ్ లైన్‌ను కూడా గుర్తించడం లేదు. పాకిస్తాన్‌కు చెందిన తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ పీచమణిస్తోంది. ఆఫ్ఘన్ యుద్ధం ముగిసిన తర్వాత తాలిబాన్‌పై పాకిస్తాన్ తన ప్రభావాన్ని కోల్పోయింది. తాలిబాన్‌కు ఇప్పుడు పాకిస్తాన్ మద్దతు అవసరం లేదు.
అత్యంత కీలక పరిణామం: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి, తాలిబాన్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తకి ఇటీవల భారతదేశంలో పర్యటించడం పాకిస్తాన్‌కు మరింత ఆందోళన కలిగించింది. అక్టోబర్ 9 నుంచి 12 వరకు ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సైన్యాల మధ్య ఖున్నీ ఘర్షణలు జరిగాయి. పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్‌పై వైమానిక దాడులు చేసిందని ఆరోపణలు రావడంతో, తాలిబాన్ డ్యూరాండ్ లైన్‌పై కాల్పులు జరిపింది. ఈ ఘర్షణల్లో 200 మంది తాలిబాన్ మిలిటెంట్లు మరణించారని పాకిస్తాన్ పేర్కొనగా.. 58 మంది పాకిస్తాన్ సైనికులను చంపామని తాలిబాన్ పేర్కొంది. అయితే పాక్ సైన్యం ఈ సంఖ్యను 23గా తెలిపింది.
బలూచ్‌ల తిరుగుబాటు
నైరుతిలో పాకిస్తాన్‌కు మరో పెద్ద సవాలు బలూచ్ తిరుగుబాటు. బలూచిస్తాన్‌లోని విలువైన ఖనిజ సంపదను దోచుకోవడంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి బలూచ్ తిరుగుబాటు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలను అమెరికాకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ఈ ఆగ్రహాన్ని మరింత పెంచింది. బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యంపై నిరంతరం దాడులు చేస్తున్నారు.
ఫిబ్రవరి 2025లో గ్వాదర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు చైనా ఇంజనీర్లు మరణించారు. ఇది సిపెక్ (CPEC - చైనా-పాక్ ఆర్థిక కారిడార్) పై జరిగిన ప్రత్యక్ష దాడి. సెప్టెంబర్ 2025లో క్వెట్టాలో ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించారు. మార్చి 2025లో బీఎల్‌ఏ జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది. బలూచ్ తిరుగుబాటు వెనుక భారత్ మద్దతు ఉందని పాకిస్తాన్ నిరాధార ఆరోపణలు చేసినా.. బలూచ్ ప్రాంతంలో ఉన్న అసంతృప్తిని అది విస్మరించింది. సెప్టెంబర్ 2025 వరకు గ్వాదర్, తుర్బత్, క్వెట్టాలలో చైనా ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్దీ దాడులు నమోదయ్యాయి.
భారత్‌తో పోరాటం
భారత్ 2024 తర్వాత పాకిస్తాన్ పట్ల తన వ్యూహాన్ని కఠినతరం చేసింది. ఉగ్రవాదం పట్ల 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబించింది. ఏప్రిల్ 2024లో పహల్గామ్ దాడి తర్వాత, భారత్ 'న్యూ నార్మల్'ను నిర్ణయించింది. మే నెలలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద దాడులకు దీటైన జవాబిచ్చింది.భారత్ జైష్-ఎ-మహ్మద్, లష్కర్-ఇ-తొయిబాకు చెందిన 9 స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన వైమానిక, డ్రోన్, సైబర్ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన 10 కంటే ఎక్కువ విమానాశ్రయాలను ధ్వంసం చేసింది. అనేక పాక్ విమానాలను కూడా కూల్చివేసింది.
దీనితో పాటు భారత్ షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఉగ్రవాద చర్యలను ఇకపై 'యాక్ట్ ఆఫ్ వార్'గా పరిగణిస్తామని.. అదే విధంగా భారత్ స్పందిస్తుందని స్పష్టం చేసింది. ఈసారి పాకిస్తాన్ తప్పు చేస్తే, చరిత్ర, భౌగోళిక శాస్త్రంలో అది ఉండాలా వద్దా అని ఆలోచించుకోవాల్సి వస్తుందని భారత్ హెచ్చరించింది. సరిహద్దుల గుండా డ్రోన్‌లు, ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌పై భారత సాంకేతిక నిఘా పాకిస్తాన్ వ్యూహాన్ని అలవోకగా అడ్డుకుంది. ప్రస్తుతం దాయాది దేశమైన పాకిస్తాన్ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications