ఎంతకు తెగించార్రా: డొనాల్డ్ ట్రంప్ కు ఘోర అవమానం: ఆన్ కెమెరా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కు ఐక్యరాజ్యసమితిలో చుక్కెదురైంది. చేదు అనుభవాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ అడుగుపెట్టగానే ఎస్కలేటర్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వీరిద్దరూ మెట్లు ఎక్కి వెళ్లాల్సొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై వైట్ హౌస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించింది.
ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లు న్యూయార్క్ చేరుకున్నారు. ఐరాసలో వారు ఎస్కలేటర్ ఎక్కుతుండగా అది హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో కుదుపులకు లోనయ్యారు. తర్వాత తేరుకుని మెట్లు ఎక్కి వెళ్లారు. దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని కోణంలో విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

అది ఉద్దేశపూర్వకంగా జరిగిగివుంటే అందుకు బాధ్యులైన వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని, విధుల నుండి తొలగించాలని లీవిట్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆమె తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ది టైమ్స్ ఆఫ్ లండన్ రిపోర్ట్ ను దీనికి జత చేశారు. ఐక్యరాజ్యసమితికి నిధులను నిలిపివేసిన నేపథ్యంలో అక్కడి సిబ్బంది ఎస్కలేటర్‌లను ఆపివేశారని ది టైమ్స్ ఆఫ్ లండన్ రిపోర్ట్ సెటైర్లు వేసింది.
అందుకే ఎస్కలేటర్ నిర్వహణకు తమ వద్ద డబ్బులు లేవనే విషయాన్ని అని అక్కడి సిబ్బంది ట్రంప్ కు ఈ రకంగా తెలియజేసినట్టు కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలను సంధించింది. ఇది వైట్ హౌస్ ఆగ్రహానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపించాలని వైట్ హౌస్ డిమాండ్ చేశారు. ట్రంప్ దంపతులు ఎస్కలేటర్ ఎక్కుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎస్కలేటర్ ను ఆపివేసినట్లయితే, వారిని వెంటనే తొలగించి విచారణ జరపాలని లీవిట్ తన పోస్ట్‌లో రాశారు.
If someone at the UN intentionally stopped the escalator as the President and First Lady were stepping on, they need to be fired and investigated immediately.
— Karoline Leavitt (@PressSec) September 23, 2025
The Times reported this on Sunday.👇 pic.twitter.com/NitsWbGYG0
అనంతరం ఆమె ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి సిబ్బంది ట్రంప్ దంపతులను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు తేలితే, దానికి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తాను వ్యక్తిగతంగా దీన్ని పర్యవేక్షిస్తానని అన్నారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఎస్కలేటర్ పనిచేయకపోవడానికి గల కారణాలను వివరించింది. వీడియోగ్రాఫర్ ఒకరు అనుకోకుండా ఎస్కలేటర్ సేఫ్టీ మెకానిజాన్ని యాక్టివేట్ చేసి ఉండొచ్చని తెలిపింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications