అమెరికాలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ! అధికారులతో ట్రంప్ సమావేశం.. కారణం?
అమెరికా వ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందుకు కారణం.. ఓపియమ్ పోప్పీ అనే మొక్కల నుంచి తయారు చేస్తున్న మాదక ద్రవ్యాలను వినియోగిస్తుండడమే!
వాషింగ్టన్: అమెరికా వ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. గురువారం అత్యున్నత సలహాదారులతోనూ, మేథావులతో ప్రత్యేక సమావేశం అనంతరం 'నేషనల్ ఎమర్జెన్సీ' ప్రకటిస్తానని బుధవారమే ఓ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.
'ఓపియమ్ పోప్పీ' అనే మొక్కల నుంచి తయారు చేస్తున్న మాదక ద్రవ్యాలను వినియోగించడం వల్ల అమెరికా వ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతోంది.
అమెరికాలో ఈ మొక్కలు, వీటితో తయారు చేసిన మాదక ద్రవ్యాలను ప్రభుత్వం 1942లోనే నిషిధించింది.

అయినా ఓపియాడ్ డ్రగ్స్ వినియోగం జరుగుతూనే ఉంది. ఈ మధ్య వాటి వల్ల మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నేషనల్ ఎమర్జెన్సీ విధించక తప్పదని ట్రంప్ ప్రకటించారు.
ఈ డ్రగ్స్ ఓవర్‌డోస్ వల్ల రోజుకు సగటున 142 మంది అమెరికన్లు మృత్యువాత పడుతున్నారని అమెరికన్ హెల్త్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో గతేడాది డ్రగ్ ఓవర్‌డోస్ వల్లే 65వేల మంది మరణించారని అంచనా.
రోడ్డు ప్రమాదాలు, గన్ కల్చర్ కంటే ఎక్కువగా ఓపియాడ్ డ్రగ్స్ వల్లే ఎక్కువ మరణాలు అమెరికాలో చోటుచేసుకుంటున్నాయి. ఓపియాడ్ డ్రగ్స్‌తో పాటు పర్సోకెట్, ఆక్సికోంటిన్, హెరాయిన్, ఫెంటనాయిల్ వంటి డ్రగ్స్ వల్ల కూడా మరణాలు జరుగుతున్నాయి.
గురువారం జరగనున్న అత్యున్నత సమావేశంలో ఓపియమ్ మొక్కలతో తయారు చేస్తున్న డ్రగ్స్‌ను అరికట్టేందుకు మార్గదర్శకాలు వెల్లడిస్తారు. డ్రగ్ అడిక్షన నుంచి పౌరులను కాపాడేందుకు ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకూ ట్రంప్ సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications