వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతో పెట్టుకోకు, లిబియా, ఇరాక్‌లకు పట్టిన గతే: కిమ్‌కు ట్రంప్ వార్నింగ్

అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ను హెచ్చరించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

సియోల్: అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ను హెచ్చరించారు.తమతో పెట్టుకున్న లిబియా, ఇరాక్‌ మాజీ అధినేలకు ఏ గతి పట్టిందో తెలుసుకదా అంటూ ట్రంప్ నిప్పులు చెరిగారు.ఉత్తరకొరియాకు సమీపం నుండే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

కిమ్ ఎఫెక్ట్: ద.కొరియాలో ట్రంప్ టూర్, టెన్షన్...టెన్షన్కిమ్ ఎఫెక్ట్: ద.కొరియాలో ట్రంప్ టూర్, టెన్షన్...టెన్షన్

ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ట్రంప్ దక్షిణకొరియా వేదికగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌ ఉన్‌‌పై హెచ్చరికలు జారీ చేశారు.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వ్యవహరశైలిపై కొంత కాలంగా ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

తన తీరును మార్చుకోవాలని ఉత్తరకొరియా అధినేత కిమ్ జంగ్‌ ఉన్‌ను పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొన్నా కిమ్ వైఖరిలో మార్పు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ కొరియా వేదికగా ట్రంప్ మరోసారి కిమ్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

 అమెరికాను తక్కువ అంచనా వేయొద్దు

అమెరికాను తక్కువ అంచనా వేయొద్దు

అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దని ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. ఉత్తర కొరియా రూపొందిస్తున్న అణ్వాయుధాలు వారికే హానీ తలపెడతాయంటూ నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌‌‌ను ట్రంప్ హెచ్చరించారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఓ కార్యక్రమంలో ట్రంప్‌ ప్రసంగిస్తూ ప్యోంగ్‌ యాంగ్‌ ఆగడాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఆయన కోరారు.

 కిమ్ ఆట కట్టించే సమయం ఆసన్నమైంది

కిమ్ ఆట కట్టించే సమయం ఆసన్నమైంది

ఉత్తర కొరియాలో ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే నియంత కిమ్‌ ఆటలు కట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయం ఆసన్నమైందని కిమ్‌పై ట్రంప్ నిప్పులు చెరిగారు. అమెరికాను లక్ష్యంగా చేసుకుని అణ్వాయుధాలు రూపొందిస్తున్నాడని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు.

 నార్త్‌కొరియా అంటే నరకం

నార్త్‌కొరియా అంటే నరకం

నార్త్‌ కొరియా అంటే నరకమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రజలు అలాంటి పాలనను ఇష్టపడటం లేదన్నారు ట్రంప్. కిమ్‌ ఒక్క విషయం గుర్తుంచుకో. అమెరికా సొంతంగానే నీ పిచ్చి చేష్టలను ఆపగలదని ట్రంప్ హెచ్చరించారు.

 రష్యా, చైనాలు ముందుకు రావాలి

రష్యా, చైనాలు ముందుకు రావాలి

ఉత్తరకొరియాపై ఏదైనా కఠినమైన నిర్ణయాన్ని తీసుకునైనా ఉత్తర కొరియాలో ప్రశాంత వాతావారణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇందుకు చైనా, రష్యాలు నియంత కిమ్‌పై ఆర్థిక, రాజకీయ అంశాల కారణంతో ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయడమే ఏకైక మార్గమని అమెరికా రక్షణ కార్యాలయం ఇటీవల పేర్కొంది.

English summary
Donald Trump has delivered a stark personal message to Kim Jong-un saying that unless he gives up his nuclear ambitions North Korea will face disaster.Speaking in front of lawmakers at South Korea’s National Assembly, the US president offered up a “brighter path” if the country abandoned its weapons programme, leaving the door open to diplomacy, but also warned the US was prepared to use military might if necessary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X