ఓర్నీ.. యుద్ధాలను ఆపుతోంది ఇందుకా..? ట్రంప్ కన్నింగ్ తెలివికి షాక్ లో ప్రపంచ దేశాలు

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య 12 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఇరు దేశాలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి మరీ విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇరు దేశాల మధ్యలో అమెరికా దూరడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ తో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై ఇప్పటివరకూ విధించిన వాణిజ్య ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ఎట్టకేలకు సద్దుమణిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై ఇప్పటివరకూ విధించిన వాణిజ్య ఆంక్షలను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ఇక ఇరాన్ నుంచి చైనా చమురు కొనుగోలు చేసుకోవచ్చు. అమెరికా నుంచి కూడా ఆ దేశాలు చమురు కొనుగోలు చేస్తాయని ఆశిస్తున్నా. ఇది నా వల్లే జరిగింది. అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ యుద్ధం ఆపడానికి కారణం.. అమెరికాలో ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకోవడానికేనని.. ఇదో బిజినెస్ ట్రిక్ అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Trump Lifts Iran Sanctions Greenlights China s Oil Imports

ఇరాన్ నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా ప్రథమస్థానంలో ఉంది. 2025లో 13.6 శాతం చమురును ఇరాన్ నుంచే కొనుగోలు చేసింది చైనా. అయితే యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ పై ట్రంప్ ఆంక్షలు విధించారు. తాజాగా ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణిగిపోవడంతో ట్రంప్ ఆ ఆంక్షలను ఎత్తివేశారు.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జూన్ 13 నుంచి జరుగుతున్న యుద్ధం ఎట్టకేలకు ఆగిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకు ఆయన కంగ్రాట్స్ తెలియజేశారు. కాల్పులను విరమించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్లు ఆయన రాసుకొచ్చారు. అయితే మరోసారి ఇజ్రాయెల్.. లైను దాటి బాంబులు ప్రయోగించే యోచనలో ఉన్నట్లు తెలిసిన ట్రంప్ తాజాగా ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై బాంబులు వేయోద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+