వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌లో ఇంకా చావని ఆశలు- జార్జియా సెక్రటరీకి ఫోన్ కాల్‌- అనుకూలంగా ఫలితం మార్చాలని

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమితో అదికారం కోల్పోయిన డొనాల్డ్‌ ట్రంప్‌లో ఇంకా అధికారంపై ఆశ చావలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. స్వింగ్‌ రాష్ట్రాల్లో ఒకటైన జార్జియాలో ఫలితం డెమోక్రాట్‌ అభ్యర్ధి, కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు అనుకూలంగా వచ్చిందని తెలిసి కూడా అక్కడ ఫలితాన్ని మార్చేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం.

ప్రస్తుతం జార్జియా స్టేట్ సెక్రటరీగా ఉన్న బ్రాడ్‌ రాఫెన్‌ స్పెర్జర్‌ రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు. దీంతో తాజాగా శనివారం ట్రంప్‌ ఆయనకు ఫోన్ చేసి జార్జియాలో తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చాలని గంటసేపు బతిమలాడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని వీరిద్దరి ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌తో సహా వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక బయటపెట్టడంతో ఈ వ్యవహారం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Trump pressures Georgia secretary of state to recalculate the vote in his favor

ఈ ఫోన్‌ కాల్‌లో ముందుగా జార్జియా స్టేట్‌ సెక్రటరీ బ్రాడ్‌ రాఫెన్‌ స్పెర్జర్‌ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ట్రంప్, ఆ తర్వాత బతిమలాడారని, అప్పటికీ ఆయన ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు కూడా దిగినట్లు తెలిసింది. నా ప్రతిపాదనకు నువ్వు అంగీకరించకపోతే పెద్ద రిస్క్‌లో పడతావంటూ ట్రంప్‌... రాఫెన్‌ను బెదిరించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్ పేర్కొంది. ఈ ఫోన్ కాల్‌ ఆద్యంతం ట్రంప్‌ ప్రతిపాదనకు జార్జియా సెక్రటరీ అంగీకరించలేదని, ఇక్కడ అధ్యక్షుడు బైడెన్‌ 11779 ఓట్ల స్ఫష్టమైన మెజారిటీ సాధించారనే విషయాన్ని ఆయన ట్రంప్‌కు పదేపదే గుర్తు చేశారని తెలిపింది.

తన ఫోన్‌కాల్ వ్యవహారం బయటికి పొక్కడంతో ట్రంప్‌ దీన్ని కొట్టిపారేశారు. జార్జియా ప్రజలతో పాటు దేశమంతా ఆగ్రహంగా ఉందని, ఫలితాలు మళ్లీ లెక్కించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్‌ వాదనపై స్పందించిన జార్జియా సెక్రటరీ ప్రెసిడెంట్‌ గారూ అక్రమాలు జరిగాయంటూ మీరు చెబుతున్న వివరాలు తప్పని స్పష్టం చేశారు. ట్రంప్‌ ఫోన్‌ కాల్‌ బెదిరింపులపై అమెరికాలో న్యాయనిపుణులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అధికార దుర్వినియోగమని, శిక్షించదగిన నేరమని చెబుతున్నారు.

English summary
President Trump urged fellow Republican Brad Raffensperger, the Georgia secretary of state, to “find” enough votes to overturn his defeat in an extraordinary one-hour phone call Saturday that legal scholars described as a flagrant abuse of power and a potential criminal act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X