ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చిన చైనా.. ఆటలు సాగవంటూ.. !

బ్రిక్స్ సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్రిక్స్ కూటమికి మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ లు విధిస్తామని ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అమెరికా విధానాలను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ పోస్టు చేశారు. బ్రిక్స్ దేశాలే కాకుండా అమెరికా విధానాలను వ్యతిరేకించే ఏ దేశమైనా టారిఫ్ లు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

అయితే తాజాగా ట్రంప్ వ్యాఖ్యలకు చైనా కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ టారిఫ్ వ్యాఖ్యలను ఖండించింది. దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. ఈ మేరకు చైనా విదేశాంగ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. బ్రిక్స్ కూటమి అమెరికాతో ఘర్షణను కోరుకోవడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

Trump s 10 Tariff Threat on BRICS Met with China s Sharp Rebuke

బ్రిక్స్ కూటమికి మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ లు విధిస్తామని ట్రంప్‌ వ్యాఖ్యలకు చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బ్రిక్స్ కూటమి అమెరికాకు వ్యతిరేకం కాదని పేర్కొంది. దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ప్రతీకార టారిఫ్ ల కారణంగా ఎవరికీ ఉపయోగం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. బ్రిక్స్ ఏ దేశానికి వ్యతిరేకంగా తీసుకురాలేదని.. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసమే బ్రిక్స్ కూటమి నెలకొల్పినట్లు తెలిపారు.

మరోవైపు బ్రెజిల్‌ లో జరిగిన 17వ బ్రిక్స్‌ కూటమి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ప్రపంచంలోని మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ అని తెలిపారు. టెర్రరిజంపై పోరుకు ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. శాంతి, సోదరభావం పట్ల భారతదేశం నిబద్ధతను చాటి చెప్పారు.

అయితే ఈ సదస్సుకు కీలక నేతలైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరు కాకపోవడం గమనార్హం. ఇక BRICS అనేది బ్రెజిల్ , రష్యా , భారత్ , చైనా , దక్షిణాఫ్రికా , ఈజిప్ట్ , ఇథియోపియా , ఇండోనేషియా , ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో ఏర్పడిన కూటమి. ఈ కూటమి 2001లో ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+