మరో భారీ ప్లాన్ దిశగా ట్రంప్..! భారత్ తో కలిపి పంచ కూటమి..?
ప్రపంచంలోని ప్రధాన శక్తులను ఒకచోట చేర్చడమే సీ5 (ఐదుదేశాల కూటమి) లక్ష్యమని ఈ నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ మధ్య వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యాలైన చైనా, రష్యా, భారత్ ఆయన్ను పట్టించుకునేందుకు నిరాకరిస్తున్నాయి. అంతే కాదు విడిగా మరో కూటమి తయారు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పెద్దన్న పాత్రకు ముప్పు రాకుండా చూసుకునేందుకు ట్రంప్ మరో కొత్త వ్యూహానికి తెరతీస్తున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయంగా తనకు సవాళ్లు విసురుతున్న భారత్, చైనా, రష్యా, జపాన్ తో పాటు అమెరికాను కూడా కలుపుకుని ఓ పంచదేశాల కూటమి ఏర్పాటు చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కూటమి ద్వారా యూరప్ ఆధిపత్యంలోని జీ7 వంటి సంప్రదాయ కూటములను పక్కన పెట్టేలా ట్రంప్ పావులు కదుపుతున్నారు. అమెరికన్ ప్రచురణ అయిన పొలిటికో నివేదిక ప్రకారం.. ఈ కొత్త కూటమికి సంబంధించిన ఆలోచన వైట్‌హౌస్ గత వారం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం యొక్క సుదీర్ఘ, అప్రచురిత వెర్షన్‌లో ఉంది.

అయితే పొలిటికో ఈ పత్రం ఉనికిని ధృవీకరించలేకపోయినా.. డిఫెన్స్ వన్ దీనిపై గతంలోనే నివేదించింది. జీ7 వంటి కూటములకు ఉండే సంపన్న, ప్రజాస్వామ్య దేశాలు అనే నిబంధనలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని ప్రధాన శక్తులను ఒకచోట చేర్చడమే సీ5 (ఐదుదేశాల కూటమి) లక్ష్యమని ఈ నివేదికలు సూచిస్తున్నాయి. వంద మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలైన అమెరికా, చైనా, రష్యా, భారత్, జపాన్ ఇందులో ఉంటాయని, ఇది జీ7 మాదిరిగానే నిర్దిష్ట అంశాలపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
మధ్యప్రాచ్యంలో భద్రత, ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాల సాధారణీకరణ సీ5 ఎజెండాలో ప్రధాన అంశంగా ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. ఇది ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానమార్పుకు సూచనగా కూడా తెలుస్తోంది. అయిత వైట్‌హౌస్ మాత్రం ఈ నివేదికల్ని ఖండిస్తోంది. ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ తాజాగా మాట్లాడుతూ అధికారిక 33 పేజీల ప్రణాళికకు ఎటువంటి ప్రత్యామ్నాయ, రహస్య వెర్షన్ లేదని వెల్లడించారు. జాతీయ భద్రతా నిపుణులు మాత్రం సీ5 ఆలోచన ట్రంపియన్ స్వభావాన్ని కలిగి ఉందని చెప్తున్నారు.

మరోవైపు ఈ ప్రతిపాదనపై అమెరికా మిత్రరాజ్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యాను యూరప్ కంటే ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఆలోచన..బలమైన నాయకులకు చట్టబద్ధత కల్పించి, పశ్చిమ దేశాల ఐక్యతను, నాటో సమన్వయాన్ని బలహీనపరుస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే బహుళ ధ్రువ ప్రపంచానికి జీ7, జీ20 వంటి ప్రస్తుతం ఉన్న వేదికలు సరిపోవని, జనాభా, సైనిక-ఆర్థిక శక్తుల మధ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీ5 ఆలోచన సూచిస్తోంది.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications