ఏదో ఒకటి చేయాల్సిందే: ఉత్తరకొరియాపై తేల్చేసిన ట్రంప్

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: వరుస అణు క్షిపణుల ప్రయోగాలు చేస్తూ రెచ్చగొడుతున్న ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఏదో ఒకటి చేయాల్సిందేనని అన్నారు.

ఉత్తర కొరియా అంశంపై ఇప్పటికే సైనిక రక్షణ శాఖ సలహాదార్లతో చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ వ్యవహారం ఏదో ఒకటి చేయాల్సిన దశకు చేరుకుందని తేల్చి చెప్పారు. ఉత్తర కొరియా విషయంలో తాను భిన్నమైన వైఖరి కలిగి ఉన్నట్లు ట్రంప్‌ తెలిపారు.

 Trump says ‘something has to be done’ on North Korea

ప్రపంచానికి, అమెరికాకు మేలు చేసిన నిర్ణయాన్నే తీసుకుంటానని వెల్లడించారు.
అమెరికాలోని గత ప్రభుత్వాలే ఉత్తర కొరియా సమస్యను పరిష్కరించి ఉండాల్సిందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఇది ఇలావుంటే ట్రంప్ వల్లే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చెబుతుండటం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump has said that he has a different approach on North Korea’s recent missile and nuclear tests, asserting that the problem has reached a point where “something has to be done”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి