'భారత్- అమెరికా సంబంధాలు డిజాస్టర్'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము విధించిన 50 శాతం టారిఫ్ లను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించేందుకు భారత్‌ ముందుకు వచ్చిందని ట్రంప్‌ తెలిపారు. అయితే దిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని.. ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ఈ మేరకు భారత్- అమెరికా సంబంధాలు ఏకపక్ష విపత్తుగా ట్రంప్ అభివర్ణించారు.

మరోవైపు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలను రష్యా తిప్పికొట్టింది. అంతేకాక ఉక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా . దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని భావించిన ట్రంప్.. భారత్ పై కన్నెర్ర చేశారు. రష్యా నుంచి అధిక మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. భారత్ వస్తువులపై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో భారత్- అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Trump Slams India-US Relations as One-Sided Disaster Criticizes Tariff Delays

ఇక తాజాగా జపాన్, చైనా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీకి చేరుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. చైనాలోని తియాంజిన్ నగరంలో నిర్వహించిన SCO సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. మోదీ వ్యాఖ్యలను ప్రపంచదేశాలు సమర్థించాయి. అంతేకాక SCO సభ్య దేశాలు ఒకే తాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు ప్రారంభం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+