హార్మూజ్ జలసంధి పేరు మార్చిన ట్రంప్..? "ట్రంప్ స్ట్రెయిట్" అంటూ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హార్మూజ్ జలసంధి పేరు మార్పునకు ట్రంప్ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇకపై 'ట్రంప్ స్ట్రెయిట్' గా పేరు మార్చాలని ట్రంప్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఇక ఇప్పటికే అమెరికా, ఇరాన్ దళాలు ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ సైనిక స్థావరాలు, రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థపై వైమానిక దాడులు చేసినట్లు తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు అమెరికాను మరింతగా దెబ్బతీసేందుకు తాము త్వరలోనే ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఘర్షణలు మరోసారి తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హార్మూజ్ జలసంధి పేరు మార్పు అంశాన్ని ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.
"హార్మూజ్ జలసంధి ఇప్పుడు అమెరికా కంట్రోల్ లో ఉంది. హార్మూజ్ స్ట్రెయిట్ ను ట్రంప్ స్ట్రెయిట్ గా మారుద్దామా..?? అమెరికా మాదిరిగానే.. హార్మూజ్ కూడా ఇదివరకంటే ఎక్కువగా హాట్ గానే ఉంటోంది" అని ట్రంప్ తన సందేశాన్ని వెల్లడించారు. ఇటీవల కెనడాతో వాణిజ్య వివాదం కారణంగా ఆ దేశంలోని 'లేక్ ఒంటారియో' ను ఇకపై 'లేక్ అమెరికా' గా పేరు మార్చాలని ట్రంప్ ఆర్డర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక 2025 లో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 'గల్ఫ్ ఆఫ్ మెక్సికో' ను 'గల్ఫ్ ఆఫ్ అమెరికా' అని పేరు మార్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని మెక్సికో గానీ కెనడా గానీ అంగీకరించలేదు.

ఇక ఇటీవలి కాలంలో హార్మూజ్ జలసంధి విషయంలో ట్రంప్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధి అమెరికా అధీనంలోనే ఉందని ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే హార్మూజ్ అమెరికాలో భాగమేనని అది యూఎస్ లో కొత్త టెర్రిటరీ అని ఓ మ్యాప్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే ఇరాన్- అమెరికా మధ్య తాజాగా సెప్టెంబర్ 1 మంగళవారం రోజున భీకర దాడులు జరిగాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు మరోసారి పెరిగాయి.












Click it and Unblock the Notifications