"నీకు పిచ్చెక్కింది, జైలుకెళ్లాల్సిన వాడివి"-నెతన్యాహుపై రెచ్చిపోయిన ట్రంప్..!

ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump), ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu)మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు తారా స్దాయికి చేరాయి. ముఖ్యంగా ఓవైపు ఇరాన్ వార్ నుంచి బయటపడేందుకు తాము చర్చలు జరుపుతున్న తరుణంలో వీటికి కీలకమైన లెబనాన్ పై ఇజ్రాయెల్ వరుసగా దాడులకు దిగడం ట్రంప్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో నెతన్యాహుకు ఫోన్ చేసిన ట్రంప్.. చెడామడా తిట్టేశారు.

ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలను ప్రమాదంలో పడేసేలా లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఉద్రిక్తతలను పెంచడంపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్.. నెతన్యాహుకు ఫోన్ కాల్ చేశారు. ఈ కాల్ లో నెతన్యాహును పిచ్చోడిగా, కృతజ్ఞత లేని వాడిగా ట్రంప్ ఆరోపించారు. ఈ కాల్ లో నెతన్యాహు తీరుపై తీవ్రంగా మండిపడ్డ ట్రంప్.. ఫైనల్ గా లెబనాన్ రాజధాని బీరుట్‌పై దాడి చేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికకు బ్రేకులు వేశారు. బీరుట్ పై బాంబు దాడి చేస్తామన్న ఇజ్రాయెల్ బెదిరింపులు ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్నని మరింత ఏకాకిని చేస్తాయని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించారు.

Trump Told Netanyahu Everybody Hates You and It s Worse Than It Sounds

నెతన్యాహును అవినీతి కేసులో జైలుకు వెళ్లకుండా తాను సాయం చేశానని ఫోన్లో ట్రంప్ గుర్తుచేశారు. నీకు పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నిన్ను నేను కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల అందరూ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారని ట్రంప్ అక్షింతలు వేశారు. ఇరాన్‌తో తాను జరుపుతున్న చర్చలను నెతన్యాహు చర్యలు దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో లెబనీస్ పౌరులు చనిపోవడం, ఒకే ఒక్క హిజ్బుల్లా కమాండర్‌ను హతమార్చడానికి భవనాలను కూల్చివేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికను ట్రంప్ వ్యతిరేకించారు. ఈ ఫోన్ కాల్ తర్వాత బీరుట్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసే ప్రణాళిక తమకు ఇప్పుడు లేదని ఒక ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. అలాగే
నెతన్యాహుతో జరిపిన ఫోన్ సంభాషణ ఫలప్రదం అయిందని, ఇజ్రాయెల్ దళాలు బీరుట్‌కు వెళ్లవని ట్రంప్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+