వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి హీక్స్ రాజీనామా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్ద కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్న హోప్ హిక్స్ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడ‌ు ట్రంప్‌ వద్ద ఆమె సుదీర్ఘకాలం ఆమె పనిచేశారు. మోడల్‌గా పనిచేసిన హీక్స్. ఆ తర్వాత ట్రంప్ వద్ద సహయకురాలిగా చేరారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడ ఆమె ట్రంప్ వద్ద కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే కమ్యూనికేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామాలు చేస్తున్నవారిలో హీక్స్ నాలుగోవారు. ఈ మేరకు హీక్స్ రాజీనామా చేసిన విషయాన్ని వైట్ హౌజ్ కూడ ధృవీకరించింది.

హీక్స్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తురాలుగా పేరున్న హీక్స్ ఈ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడంపై స్పష్టమైన కారణాలు మాత్రం చెప్పలేదని వైట్ హౌజ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Trump Top Communications Aide Hope Hicks To Resign: White House

ట్రంప్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ట్రంప్ కోసం తాను అబద్దాలు ఆడాల్సి వస్తోందనే అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ట్రంప్ నియమించుకొన్న వారిలో మొట్టమొదటివారిలో హీక్స్ ఒకరు.

ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయులైన వారిలో హీక్స్ ఒకరు. ఆమె ట్రంప్‌కు అత్యంత విలువైన సలహలను ఇచ్చారనే ప్రచారం కూడ లేకపోలేదు. అధ్యక్ష ఎన్నికల సమయంలో హీక్స్ కీలకంగా వ్యహరించారని చెబుతుంటారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనే విషయమై అమెరికా చట్టసభల ప్రతినిధుల ఇంటలిజెన్స్ కమిటీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం. ఈ ఎన్నికల సమయంలో హీక్స్ ట్రంప్ తరపున అధికార ప్రతినిధిగా కొనసాగారు.

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హీక్స్ ట్రంప్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా సెప్టెంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు.

English summary
Hope is outstanding and has done great work for the last three years. She is as smart and thoughtful as they come, a truly great person," Donald Trump said in a statement released by the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X