శ్రీలంక పేలుళ్లలో 13కోట్ల 38 మంది లక్షల మంది మరణించినట్లు ట్రంప్ ట్వీట్
న్యూయార్క్: శ్రీలంకలో సంభవించిన ఆత్మాహూతి దళ బాంబు పేలుళ్లపై సంతాపాన్ని తెలియజేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్.. తప్పుడు సంకేతాలను పంపించింది. ఆయన పొరపాటుగా చేసిన ట్వీట్ అది. అనంతరం దాన్ని డిలీట్ చేశారనుకోండి. అది వేరే విషయం. మృతుల సంఖ్యను ఆయన ఎక్కువ చేసి, చూపించారు. ఎంత ఎక్కువ అంటే.. కోట్లల్లో. శ్రీలంక బాంబు పేలుళ్లలో 138 మిలియన్ల మంది మరణించినట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. అనంతరం దాన్ని డిలీట్ చేశారు. 138 మిలియన్లు అంటే.. 13 కోట్ల 38 లక్షలు.
శ్రీలంకలో వరుసగా సంభవించిన బాంబు పేలుళ్లపై దాదాపు అన్ని ప్రపంచ దేశాలూ స్పందించాయి. శ్రీలంక ప్రభుత్వానికి, ప్రజలకు నైతిక మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో 138 మిలియన్ ప్రజలు మరణించారని, 600 మందికి పైగా గాయపడ్డారని, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తొలుత ట్వీట్ చేశారు. నిజానికి- 138 మందిగా చూపించబోయి.. పొరపాటున 138 మిలియన్లుగా రాసుకొచ్చారు. కొన్ని నిమిషాల పాటు ఆ ట్వీట్ అలాగే కొనసాగింది.

-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications