ట్రంప్ విశ్వరూపం: ఒక్క రోజే 5 బాంబులు పేల్చిన అమెరికా అధ్యక్షుడు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాలను మరోసారి కుదిపేస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఆయన చేసిన 5 ప్రకటనలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేయడమే కాకుండా, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో అనే ఆందోళనను పెంచుతున్నాయి. మంగళవారం(జనవరి 20) నాడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా చేసిన సంచలనాల సారాంశం ఇదీ.
1. నోబెల్ రాలేదని అలిగిన ట్రంప్!
తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నార్వే ప్రధానికి ఆయన రాసిన లేఖ లీక్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. "8 యుద్ధాలను ఆపిన నాకు నోబెల్ ఇవ్వకపోవడం సరికాదు. ఇకపై ప్రపంచ శాంతి గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకు లేదు. ఇప్పుడు అమెరికాకు ఏది లాభమో అదే చేస్తాను" అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. నోబెల్ రాకపోవడమే తాను గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడానికి ఒక కారణమన్నట్లుగా ఆయన సంకేతాలిచ్చారు.

2. గ్రీన్‌లాండ్‌లో అమెరికా జెండా పాతిన ట్రంప్!
గ్రీన్‌లాండ్‌ను అమెరికా భూభాగంగా మారుస్తానని గతంలోనే చెప్పిన ట్రంప్, ఇప్పుడు దాన్ని కార్యరూపంలో చూపిస్తున్నారు. ట్రూత్ సోషల్‌లో ఓ ఏఐ చిత్రాన్ని షేర్ చేస్తూ.. గ్రీన్‌లాండ్ మట్టిపై అమెరికా జెండాను పాతారు. అక్కడ ఒక బోర్డుపై "Greenland US Territory Est. 2026" అని రాసి ఉండటం గమనార్హం. దీనిపై డెన్మార్క్ ప్రధాని తీవ్రంగా స్పందిస్తూ.. "మా స్వేచ్ఛ, సరిహద్దుల విషయంలో రాజీ పడేది లేదు" అని తెగేసి చెప్పారు.
3. అమెరికా కొత్త మ్యాప్.. కెనడా, వెనిజులా కూడా మావే!
ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి అమెరికా కొత్త మ్యాప్‌ను ఆవిష్కరించారు. ప్‌లో గ్రీన్‌లాండ్‌తో పాటు కెనడా, వెనిజులాలను కూడా అమెరికా జెండా రంగులతో (ఎరుపు, తెలుపు, నీలం) నింపేశారు. మ్యాప్‌ను ఐరోపా దేశాల నేతలకు చూపిస్తున్నట్లు ఉన్న చిత్రం యూరోపియన్ యూనియన్‌లో కలకలం రేపింది.
4. ఫ్రాన్స్‌కు 200% టారిఫ్ షాక్!
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ట్రంప్ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. జా శాంతి బోర్డులో చేరడానికి మాక్రాన్ నిరాకరించడంతో, ఫ్రాన్స్ నుంచి వచ్చే వైన్,షాంపేన్‌లపై 200 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరించారు. క్రాన్‌తో జరిగిన ప్రైవేట్ చాట్ స్క్రీన్‌షాట్‌లను కూడా ట్రంప్ లీక్ చేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం రేపింది.
5. బ్రిటన్‌పై 'గ్రేట్ స్టుపిడిటీ' వ్యాఖ్యలు!
హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా ద్వీపంపై బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు.తన సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు అప్పగించడాన్ని "అతిపెద్ద మూర్ఖత్వం" అని ఆయన అభివర్ణించారు. ది అమెరికా సైనిక స్థావరానికి ముప్పు అని, బ్రిటన్ బలహీనత వల్లే రష్యా, చైనాలు ఆర్కిటిక్,హిందూ మహాసముద్రంలో బలపడుతున్నాయని, అందుకే తాను గ్రీన్‌లాండ్‌ను తీసుకోవడం అత్యవసరమని ఆయన వాదించారు.












Click it and Unblock the Notifications