ఇరాన్ భూస్థాపితం..?? ఆ దేశంపై ట్రంప్ అణు బాంబ్..!!
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరింది. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. ఇక ఇప్పటికే ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని ఇప్పటికే ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన విషయం. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకంగా మారనుందని వెల్లడించారు. ట్రంప్ మాటలను బట్టి చూస్తే ఇరాన్ పై న్యూక్లియర్ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే న్యూక్లియర్ స్టైక్ చేయడానికి ట్రంప్ కు ఫుల్ అధికారం ఉంది. ఆయన ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి.
తాజాగా ఇరాన్ కు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ప్రపంచ దేశాల్నే భయాందోళనకు గురి చేస్తోంది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని ట్రంప్ శపథం చేయడంతో న్యూక్లియర్ ఎటాక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ లోని ఖర్గ్ ఐలాండ్, ఆయిల్ హబ్స్ పై అమెరికా దాడులు చేశాక ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా వద్ద ఇప్పటి వరకూ ఉపయోగించని ఆయుధాలు చాలానే ఉన్నాయని జేడీ వాన్స్ చెప్పడం గమనార్హం. అయితే ఇప్పుడు బాల్ ఇరాన్ కోర్టులోనే ఉందని.. త్వరలో యుద్ధం ముగుస్తుందని ఆయన అన్నారు.
ఇక అమెరికా రాజ్యాంగం ప్రకారం అణు దాడికి ఆదేశాలు జారీ చేసే అధికారం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. దీనికోసం న్యూక్లియర్ ఫుట్ బాల్ అని పిలిచే సూట్ కేస్ ద్వారా ఆయన ధ్రువీకరణ కోడ్స్ పంపించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఇరాన్ పై అమెరికా అణుదాడికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏ క్షణమైనా ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా విధించిన డెడ్ లైన్ ముగిసిన నేపథ్యంలో తనతో సహా కోటి 40 లక్షల మంది ఇరాన్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అలాగే ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కు బదులిచ్చింది ఇరాన్. తమపై దాడులు చేస్తే మర్చిపోలేని దెబ్బ కొడతామని వార్నింగ్ ఇచ్చింది. తాజా పరిణామాల మధ్య పశ్చిమాసియాలో మరికొన్ని గంటలు కీలకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications