వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ ఓటమి?: హిస్టరీ ప్రొఫెసర్ తేల్చేశారు, 84 నుంచి ఆయన అంచనాలే కరెక్ట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలు కానున్నారా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ అలన్ లిచ్‌మన్. ఈయన 1984 నుంచి అంచనా వేస్తున్న ఫలితాలే వస్తుండటం గమనార్హం. తన '13 కీస్' సిస్టమ్ ద్వారా ఆయన ఈ అంచనాను వేస్తున్నారు.

1984 నుంచి తప్పని అంచనాలు..

1984 నుంచి తప్పని అంచనాలు..

1984లో జరిగిన రోనాల్డ్ రీగన్స్ రీఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు అలన్ చెప్పిన విధంగానే.. అమెరికా అధ్యక్షులు గెలుపొందడం గమనార్హం. 2000 సంవత్సరంలో అల్ గోరే గెలుస్తారని కూడా అలన్ అంచనా వేశారు. దీంతో లన్ లిచ్‌మన్ అంచనాలపై ఆసక్తి నెలకొంది.

డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పదు..?

డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పదు..?

ప్రస్తుతం అలన్ లిచ్‌మన్ తన 13 కీస్ సిస్టమ్‌ను ఉపయోగించి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని కూడా చెప్పేశారు. సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లన్ లిచ్‌మన్ తన అంచనాలను స్పష్టం చేశారు. ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఓడిపోతారని తేల్చిచెప్పారు. ఆయన వైట్ హౌస్ విడిచిపెట్టాల్సిందేనని అన్నారు.

అలన్ 13 కీస్ సిస్టమ్...

అలన్ 13 కీస్ సిస్టమ్...

అలన్ లిచ్‌మన్ తన అంచనాను "13 కీస్" యొక్క నమూనాపై ఆధారపరుస్తాడు, అది ఏదైనా ఎన్నికలకు నిజం లేదా తప్పు అని సమాధానం ఇవ్వవచ్చు. అతని వ్యవస్థలోని "13 కీస్" లో ఆర్థిక వ్యవస్థ, అధికారంలో, సామాజిక అశాంతి, కుంభకోణాలు, అలాగే అభ్యర్థుల వ్యక్తిగత తేజస్సు ఉన్నాయని తెలిపారు. ‘రహస్యం ప్రస్తుత బలం, పనితీరు యొక్క పెద్ద చిత్రంపై మీ దృష్టిని ఉంచుతుంది. ఎన్నికలు, పండితులు, ప్రచారం యొక్క రోజువారీ హెచ్చు తగ్గులు గురించి ఎటువంటి శ్రద్ధ చూపవద్దు. అసలు ఫలితం కీస్ అంచనా వేస్తాయి' అని వెల్లడించారు.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం ఇదే?

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం ఇదే?

2016 తరువాత, అమెరికన్లు ప్రెసిడెన్షియల్ ప్రిడిక్షన్ మోడల్స్ గురించి (అవగాహనతో) జాగ్రత్తగా ఉన్నారు. కానీ అలన్ లిచ్‌మన్ ఫలితాలను కొట్టిపారేయడం సరికాదని, అది ఇసుకలో మీ తలను అంటుకున్నట్లు అనిపిస్తుంది" అని సీఎన్ఎన్ ఎడిటర్ తెలిపారు. కాగా, 1984 నుంచి తన కీస్ సిస్టమ్ ద్వారా చెప్పిన అంచనాలు ఇప్పటి వరకు తప్పలేదని అలన్ లిచ్‌మన్ అన్నారు. ఇప్పుడు కూడా తన అంచనాలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థిగా డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి ఇదే పార్టీ నుంచి భారత మూలాలున్న కమలా హారీస్ పోటీ చేస్తున్నారు.

English summary
He has correctly predicted the winner of each presidential race since Ronald Reagan's reelection victory in 1984 using his "13 keys" system. (It's worth mentioning that in 2000, Lichtman predicted that Al Gore would win the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X