నోబెల్ నాకే రావాలి: ట్రంప్ సంచలనం
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానని.. దానితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏడు ప్రధాన ఘర్షణలను ఆపానని ఆయన పేర్కొన్నారు. ఈ కృషికిగాను తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమెరికాకు ఉన్న విశ్వసనీయత వల్లే అనేక వివాదాలను పరిష్కరించగలిగామని వెల్లడించారు. దీనికి ఉదాహరణగా భారత్-పాకిస్థాన్, థాయిలాండ్-కంబోడియా దేశాల మధ్య ఘర్షణలను నిలువరించానని పేర్కొన్నారు. "భారత్, పాకిస్తాన్‌ల విషయంలో ఒకవేళ యుద్ధం జరిగితే మనం వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని నేను స్పష్టం చేశాను. రెండు దేశాలకు వాణిజ్యం అవసరం కాబట్టి, పరిస్థితి అదుపులోకి వచ్చింది" అని ట్రంప్ వివరించారు.

ఆయన ఆపిన ఏడు ఘర్షణలు
డొనాల్డ్ ట్రంప్ తన కృషి వల్ల భారత్-పాకిస్తాన్, థాయిలాండ్-కంబోడియా, అర్మేనియా-అజర్‌బైజాన్, కొసొవొ-సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, రువాండా-కాంగోల మధ్య జరిగిన ఏడు వివాదాలు ఆగిపోయాయని పేర్కొన్నారు. ఇందులో దాదాపు 60 శాతం వివాదాలు వాణిజ్య ఒత్తిడి వల్లే పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్యాఖ్యలు
భారత్‌కు తాను ఇచ్చిన హెచ్చరికను ప్రస్తావిస్తూ ట్రంప్.. భారత్, పాకిస్తాన్‌లు అణుశక్తి దేశాలని, యుద్ధం జరిగితే అందరికీ నష్టమని గుర్తు చేశానని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరిస్తే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తారని తనతో అన్నారని, అయితే తాను అంతకుముందే ఏడు ఘర్షణలను నిలువరించానని, కాబట్టి వాటికి ఒక్కొక్కదానికి ఒక్కో నోబెల్ బహుమతి రావాలని ఆయన చమత్కరించారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం తాను అనుకున్నంత సులభం కాదని ట్రంప్ అంగీకరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి తాను ఊహించిన దానికంటే చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. అయితే, ఏదో ఒక విధంగా దీనికి కూడా పరిష్కారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.
-
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
స్వయానా ట్రంప్ నోట -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications