ట్రంప్ కన్నింగ్ ప్లాన్.. పాకిస్థాన్ కు అత్యాధునిక క్షిపణులు.. భారత్ కు పెను ముప్పు..
పాకిస్థాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన అత్యాధునిక AMRAAM మిసైల్స్ ను పాకిస్థాన్ కు విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ వస్తువులపై ఇటీవల అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. కానీ పాకిస్థాన్ తో మాత్రం వరుసగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది అగ్రరాజ్యం. ఇటీవల పాకిస్థాన్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ను దిగుమతి చేసుకుంది అమెరికా. తాజాగా మరో కీలక ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్రంప్.
అమెరికాకు చెందిన అత్యాధునిక, శక్తివంతమైన AMRAAM మిసైల్స్ ను పాకిస్థాన్ కు విక్రయించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేతియాన్ అనే కంపెనీ రూపొందించిన అడ్వాన్స్ డ్ మీడియం రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ మిసైల్(AMRAAM) ను పాకిస్థాన్ కు విక్రయించనుంది. తాజాగా అమెరికా డిఫెన్స్ డిపార్ట్ మెంట్.. AMRAAM మిసైల్స్ ను కొనుగోలు చేసే దేశాల జాబితాలో పాకిస్థాన్ ను చేర్చింది. ఈ మిసైల్ రేంజ్ లోకి మొత్తం భారత్ వస్తుంది. ఇదే దీని ప్రత్యేకత కావడం గమనార్హం. దీంతో భారత్ కు పెనుముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ను అప్ గ్రేడ్ చేసుకునే క్రమంలో AMRAAM మిసైల్స్ ను కొనుగోలు చేస్తుంది. అయితే ఎంత సంఖ్యలో కొనుగోలు చేస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పీస్ డ్రైవ్ ప్రోగ్రామ్ కింద గతంలో ఈ మిసైల్ ను పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఇదే క్షిపణితో 2019లో భారత్ కు చెందిన మిగ్-21 బీఐఎస్ ను కూల్చేసింది. అయితే ఇటీవలికాలంలో ఈ మిసైల్స్ ను అమెరికా అప్ గ్రేడ్ చేసింది. దాంతో వాటిని తిరిగి కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్.. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంతో పాకిస్థాన్ కు అత్యాధునిక ఆయుధ సంపత్తిని అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధం అయినట్లుగా భావించవచ్చు. అమెరికా- పాకిస్థాన్ మధ్య డిఫెన్స్ ఒప్పందానికి ఈ డీల్ కీలకంగా మారనున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. పాకిస్థాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబార్ జులైలో అమెరికాలో పర్యటించిన సమయంలో ఈ ఒప్పందం ఓకే అయింది.












Click it and Unblock the Notifications