Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సునామీ కల్లోలం.. 2011 నాటి విలయం పునరావృతమవుతుందా?

Tsunami Alert: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యాలో 8.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంప ప్రభావం.. జపాన్ పై తీవ్రంగా పడింది. జపాన్ దేశ తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురవుతోంది. ఇప్పుడు జపాన్‌ను సునామీ భయం వెంటాడుతోంది. ఇప్పటికే సముద్రంలో ఎత్తైన అలలు కనిపించడంతో, జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. పసిఫిక్ తీరంలో హొక్కాయిడో నుండి వకయామా వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.ఈ పరిణామం 2011లో జపాన్‌ను అతలాకుతలం చేసిన భయంకరమైన సునామీ విపత్తును గుర్తు చేస్తోంది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అధికారులు, గతంలో సునామీ బారిన పడిన ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌ను వేగంగా ఖాళీ చేసే పనులను ప్రారంభించారు.

2011లో సునామీ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఫుకుషిమా దైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ఖాళీ చేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. గతంలో(2011) ఇదే ప్లాంట్ వద్ద సునామీ వల్ల సంభవించిన విపత్తులో దాదాపు 19 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సారి అలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఫుకుషిమా దైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపాన్‌లోని ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లో ఉంది. 1971లో దీని నిర్మాణం పూర్తి కాగా.. అప్పటి నుంచి ఇది టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (TEPCO) ద్వారా నడపబడుతోంది.

Tsunami Alert in Japan Is 2011 s Devastation Repeating Itself

2011 సునామీ కారణంగా జరిగిన భారీ వినాశనం కారణంగా ప్లాంట్‌లోని చాలా భాగం దెబ్బతింది. 2011 సునామీకి ముందు అందులో 6 అణు రియాక్టర్లు ఉండేవి. ప్రస్తుతం అక్కడ కేవలం ఒక రియాక్టర్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ రియాక్టర్ ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించడం లేదు. 2011 సునామీ సంభవించినప్పటి నుంచి దెబ్బతిన్న ప్లాంట్‌ను శుభ్రం చేసే పనులు ఇంకా జరుగుతున్నాయి. అయితే తాజా సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్లాంట్‌లోని మిగిలిన ప్రాంతాలను సురక్షితంగా ఖాళీ చేసే పనులు వేగవంతం చేశారు. గతంలో మాదిరిగా ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2011లో జపాన్‌లో ఏం జరిగింది?
2011 మార్చి 11న జపాన్‌లోని ట్రెంచ్‌లో హోన్షుకు ఉత్తర-తూర్పు తీరంలో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం 9.1 తీవ్రతతో సంభవించింది. దీనివల్ల సముద్రంలో కేవలం 30 నిమిషాల్లోనే సునామీ పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా సముద్రంలో భారీగా నీటి అలలు ఎగిసిపడ్డాయి. ఈ సునామీ బారిన పడిన ప్రతిదీ నీటితో కొట్టుకుపోయింది. రాకాసి అలలు తీర ప్రాంతాలను ముచ్చెత్తాయి. వాటి మార్గంలో వచ్చిన ప్రతిదానిని, ఇళ్లను, వాహనాలను, మనుషులను అన్నింటిని సునామీ ముంచెత్తింది. ఈ విపత్తులో సుమారు 19 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు మృతదేహాలు కూడా లభించలేదు.

ఈ సునామీ ప్రభావం అత్యధికంగా ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌పై పడింది. సునామీ కారణంగా ప్లాంట్‌లోని కూలింగ్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. దీని ఫలితంగా ప్లాంట్‌లోని మూడు రియాక్టర్లలో కోర్ మెల్ట్‌డౌన్ (Core meltdown) ప్రారంభమైంది. కోర్ మెల్ట్‌డౌన్ అంటే అణు రియాక్టర్లు కరిగిపోవడం. ఇది వాతావరణంలో రేడియోధార్మిక పదార్థాలను విడుదల చేసి తీవ్రమైన పర్యావరణ, ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అయితే, ప్రస్తుతం ఫుకుషిమా ప్లాంట్ 2011లో ఉన్నంత ప్రమాదకరమైన స్థితిలో లేదు, ఎందుకంటే ఆ విపత్తు తర్వాత దానిని పూర్తిగా మూసివేశారు.

జపాన్ లో తాజా సునామీ హెచ్చరికలు, భూకంపాల పరంపర ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2011లో ఎదుర్కొన్న విలయాన్ని దృష్టిలో ఉంచుకుని.. జపాన్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌ను ఖాళీ చేయడం ఈ చర్యలలో ఒక భాగం. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+