యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్.. ఇలా అయితే కష్టమే !

ఉన్నత విద్య కోసం యూకే వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులకు యూకే ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలు తమ ట్యూషన్ ఫీజులను ప్రతి ఏడాదీ పెంచనున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఫీజుల పెంపు ద్వారా విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా స్థిరంగా ఉండగలవని యూకే విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్సన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

అంతే కాకుండా ట్యూషన్ ఫీజులను పెంచడం వల్ల.. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందించగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనివర్సీటీలు మెరుగైన ఫలితాలను సాధించగలవని.. అటువంటి యూనివర్సిటీలే గరిష్ఠ ఫీజులను వసూలు చేయగలవని మంత్రి పేర్కొన్నారు. ఫీజు పెంపు వల్ల విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. విద్యార్థుల కొత్త నైపుణ్యాలు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

tuition-fee-in-england-universities-increasing-in-2026

కాగా ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలు గత సెప్టెంబరులో ట్యూషన్ ఫీజులను పెంచాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరానికి ఫీజు 9,535 పౌండ్లుగా ఉంది. 2026లో ద్రవ్యోల్బణం కొనసాగితే ఫీజులు సుమారుగా 400 పౌండ్ల పెరుగుతూ 9,900 పౌండ్లకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయాలు గత కొన్ని సంవత్సరాలలో ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఖర్చులను నియంత్రించడానికి గత ఏడాది దాదాపు 12,000 ఉద్యోగులను తొలగించారు.

ఈ ఫీజు పెంపు ముఖ్యంగా విదేశీ విద్యార్థులపై వ్యయ భారం పెంచే అవకాశం ఉంది. స్కాలర్‌షిప్లు, ఆర్థిక సాయం లేకపోతే కొందరు విద్యార్థులు యూకే విద్య కోసం అవకాశం కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. ఫీజు పెంపు కారణంగా యూకే విద్యార్థి మార్కెట్ మరింత ప్రీమియం డొమైన్‌గా మారే అవకాశం కూడా ఉంది.

అయితే విదేశీ విద్యార్థులు ముందస్తుగా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాంకు లోన్, స్కాలర్‌షిప్ లేదా ఆర్థిక సాయం అవకాశాలను పరిశీలించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే నివాస ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ఇతర ఫీజులను ముందుగా లెక్కించడం ద్వారా ఏకకాలంలో పెరుగుదలకు ఎదుర్కొనవచ్చు. యూకే ప్రభుత్వం ఫీజు పెంపు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తుందని హామీ ఇచ్చింది. కొంతమంది విద్యార్థులు పెంపుకు మినహాయింపులు పొందే అవకాశం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+