టర్కీ-నేపాల్ విమానానికి తప్పిన ప్రమాదం, ప్రయాణీకులకు గాయాలు
ఖాట్మాండు: తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బుధవారం నాడు నేపాల్‌లో టర్కీ విమానానికి ప్రమాదం తప్పింది. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
టర్కిష్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం బుధవారం నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. రన్ వే పైకి దిగింది. అయితే రన్ వే పైన అది స్కిడ్ అయింది.

ఆ సమయంలో విమానంలో 238 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ విమానం ఇస్తాంబుల్ నుండి వచ్చింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు తప్పితే పెద్దగా ఏమీ కాలేదని అధికారులు చెబుతున్నారు.
నేపాల్‌లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు మంచుతో కప్పేసి ఉంది. ఇటీవలే 330 మందితో కూడిన విమానం ఒకటి గడ్డిలో చిక్కుకుపోయింది.












Click it and Unblock the Notifications