వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్ 370: ఇప్పించాలని దావా వేసిన చిన్నారులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: దాదాపు ఎనిమిది నెలల క్రితం మలేషియాకు చెందిన ఎంహెచ్ 370 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. ఇందులోని ప్రయాణీకులు అందరు మృతి చెందారు. అయితే, ఈ విమానం గల్లంతుకు సంబంధించి ఇద్దరు చిన్నారులు కౌలాలంపూర్ హైకోర్టులో దావా వేశారు.

ఎంహెచ్ 370 విమానంలో ప్రయాణిస్తున్న తన తండ్రి మృతికి మలేషియా ఎయిర్ లైన్స్, ప్రభుత్వమే కారణమని చిన్నారులు శుక్రవారం ఈ దావా వేశారు. ఎంహెచ్ 370 గల్లంతుకు సంబంధించి.. అందులో మృతి చెందిన వారి బంధువులు కోర్టుకు ఎక్కడం ఇదే ప్రథమం!

జీ కిన్సన్ (13), జీ కిన్‌లాండ్ (11) అనే ఇద్దరు చిన్నారులు సివిల్ ఏవియేషన్ డిపార్టుమెంట్ తీరును తమ దావాలో తప్పుపట్టారు. ఎంహెచ్ 370 విమానానికి రాడార్‌తో సంబంధం తెగిపోయిన వెంటనే దానిని గుర్తించేందుకు సరైన ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు.

Two boys sue Malaysia Airlines, govt over loss of father in missing Flight 370

ఈ వాద్యాన్ని చిన్నారులు శుక్రవారం నాడు కౌలాలంపూర్ హైకోర్టులో వేశారు. విమానం సురక్షితంగా ప్రయాణించేందుకు చేపట్టాల్సిన అన్న చర్యలను తీసుకోవడంలో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వహించిందన్నారు.

తాము ఎనిమిది నెలలు వేచి చూశామని, పలువురు అధికారులు, నిపుణులతో మాట్లాడాక దీనిని దాఖలు చేశామని చిన్నారుల తరఫు న్యాయవాది అరుణన్ సెల్వరాజ్ తెలిపారు. కేసు బలంగా ఉండేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.

టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ కాలంలో, ఇంత పెద్ద విమానం అదృశ్యం కావడం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, దావా వేసిన ఇద్దరు చిన్నారులు... తమ మనోవేదన, తండ్రి జీ జింగ్ హాంగ్ అదృశ్యమైన నేపథ్యంలో తమకు జరిగిన నష్టం తదితరాలకు పరిహారం చెల్లించాలని వారు దావా వేశారు. వారి తండ్రి జీ జింగ్ హంగ్ ఓ ఇంటర్నెట్ సంబంధిత వ్యాపారం చేసేవాడు. అతను నెలకు సుమారు 5,200 డాలర్గుగా ఉండేదట.

English summary
Two Malaysian children sued Malaysia Airlines and the government on Friday over the loss of their father on Flight 370, the first lawsuit filed in the country by relatives of those aboard the jetliner that mysteriously disappeared eight months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X