జస్ట్ రెండు గ్లాసులు నీళ్లతో ఎంత బెనిఫిట్ ఉందో తెలుసా?
లండన్ : అధిక బరువుతో బాధపడేవారికి నిజంగా ఇదొక మంచి చిట్కా. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీటిని తాగడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు బర్మింగ్ హామ్ యూనివర్సిటీ పరిశోధకులు. భోజనానికి ముందు.. రెండు గ్లాసులు నీరు తాగడం ద్వారా తక్కువ ఆహారం తీసుకుంటారని, తద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ బరువును తగ్గించుకునే అవకాశముంటుందని పరిశోధకులు వెల్లడించారు.
ఈ ప్రక్రియను ప్రతీరోజు క్రమం తప్పకుండా పాటించినట్లైతే.. మూడు నెలల్లోగా 4 కిలోల బరువు తగ్గవచ్చునని అధ్యయనంలో తేలినట్లు లండన్ ఒబెసిటీ జర్నల్ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ సింపుల్ చిట్కా ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండానే అధిక బరువును తగ్గించుకోవచ్చునని పరిశోధకులు అంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం 5-17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 268మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశముందని వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది. వీరిలో 98మిలియన్ల మంది స్థూలకాయం బారినపడే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. 2014 లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 18ఏళ్లు పైబడ్డ వారిలో 1.9బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని, వీరిలో 600 మిలియన్ల మంది స్థూలకాయులేనని ఒబెసిటీ జర్నల్ ద్వారా వెల్లడయింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications