మత సదస్సులో అర్థనగ్నంగా మహిళలు
ప్యారిస్: ఇస్లాం అనే అంశంపై సదస్సు జరుగుతుండగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఇద్దరు మహిళలు అర్థనగ్నంగా వేదిక మీదికి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారిద్దరినీ బలవంతంగా కిందకు ఈడ్చేశారు. ఇద్దరు ఇమామ్‌లు వేదిక మీద ప్రసంగిస్తుండగా మహిళలు ఉన్నట్లుండి అర్థనగ్నంగా మారి వేదిక మీదికి దూసుకెళ్లారు.
వీరిలో ఒకరు అల్జీరియా జాతీయురాలు కాగా, మరొకరు ట్యూనీషియా జాతీయురాలు. "నాకెవరూ ఆదేశాలు ఇవ్వలేరు, నాకు నేనే ప్రవక్తను" అనే నినాదాలను వారు తమ శరీరాల మీద రాసుకుని వచ్చారు. వేదిక మీద అవే నినాదాలు ఇచ్చారు. దాంతో దాదాపు 15 మంది కింద నుంచి పైకి వచ్చి ముందు ఇమామ్‌లను వారి నుంచి దూరం తీసుకుని వెళ్లారు.

తర్వాత ఆ మహిళలను కిందికి లాగేశారు. కొంత మంది వాళ్లను కొడుతుండగా పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై నిరసనకారుల వాదన మరో విధంగా ఉంది. "మీరు మీ భార్యలను కొట్టాలా, వద్దా" అనే అంశంపై ఆ ఇద్దరు ఇమామ్‌లు చర్చిస్తున్నారని వారు తెలిపారు. అందుకే నిరసల తెలియజేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ఆ ఇద్దరు మహిళలు కూడా వివాదాస్పద స్త్రీవాద గ్రూపు ఫెమిన్‌కు చెందినవారని తెలుస్తోంది. నగ్న ప్రదర్శనలకు వారు పెట్టింది పేరు. సదస్సుపై నిరనస వ్యక్తం చేస్తూ అంతకు ముందు పిటిషన్‌పై ఆరు వేల మంది సంతకాలు చేశారు.












Click it and Unblock the Notifications