వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘బలవంతంగా ముద్దులు పెట్టి, తాకరాని చోట్ల తాకారు’

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ చేసిన మరో కంపు పని వెలుగుచూసింది. తమను లైంగిక వేధించాడని ఓ ఇద్దరు మహిళలు ఆరోపించారు. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని ఓ మహిళ ఆరోపించగా, తనను తాకరాని చోట్ల తాకి తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

మహిళలను అసభ్యంగా తాకడం గురించి ట్రంప్.. 2005లో చెప్పిన మాటల వీడియో విడుదల అయిన తర్వాత ఈ ఆరోపణలు రావడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలను రెండో డిబేట్‌లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా విమర్శించారు. మహిళలను గతంలో వాళ్ల అనుమతి లేకుండా ముద్దుపెట్టుకున్నారా? అని ప్రశ్నించినపుడు ఆయన మాత్రం లేదని సమాధానం ఇచ్చారు. ట్రంప్ అనుచరులు కూడా తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించి.. అది ఆయన వ్యక్తిత్వ హననమే అవుతుందన్నారు.

Two Women Say Donald Trump Touched Them Inappropriately

కాగా, దాదాపు మూడు దశాబ్దాల క్రితం తాను, ట్రంప్ పక్కపక్క సీట్లలో విమానంలో ప్రయాణించినట్లు జెస్సికా లీడ్స్(74) అనే వ్యాపారవేత్త చెప్పారు. అప్పుడు ట్రంప్ తనను అసభ్యంగా తాకారన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత ట్రంప్ తమ రెండు సీట్ల మధ్య చెయ్యిపెట్టుకోడానికి ఉన్న ఆర్మ్ రెస్ట్‌ను తీసేసి.. తనను చాలా అసభ్యంగా తాకడం మొదలుపెట్టారని, తన స్కర్టు మీద కూడా చెయ్యి వేశారని ఆమె అన్నారు. అతడు ఆక్టోపస్‌ లాంటివాడని, అతడి చేతులు అన్నిచోట్లా ఉన్నాయని ఆరోపించారు. అప్పటికి తన వయసు 38 ఏళ్లన్నారు. దీంతో తాను వేరే సీటులోకి మారిపోయానని చెప్పారు.

ఇది ఇలా ఉండగా, రచెల్ క్రూక్స్ (22) అనే మరో మహిళ 2005లో ట్రంప్ టవర్‌లోని ఒక రియల్ ఎస్టేట్‌ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు. ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశారని, తనను తాను ఆయనకు పరిచయం చేసుకుని షేక్‌హ్యాండ్ ఇవ్వగా.. ట్రంప్ ముందు బుగ్గల మీద, తర్వాత పెదాల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పారు.

అది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని, తాను ఏమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన కార్యాలయానికి వచ్చి ఫోన్ నెంబరు అడిగారన్నారు. ఎందుకు కావాలని అడగ్గా.. తన మోడలింగ్ ఏజెన్సీకి పంపుతానని చెప్పారన్నారు. తాను పనిచేసే బేరాక్ గ్రూప్ కంపెనీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా తాను చెప్పాల్సి వచ్చింది గానీ మోడలింగ్ ఏజెన్సీ వాళ్లు మాత్రం ఎప్పుడూ తనకు ఫోన్ చేయలేదన్నారు.

అయితే... ఇప్పుడు ఆరోపణలు చేసిన మహిళలిద్దరిలో ఎవరూ ఘటనలు జరిగినప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. ట్రంప్ మాత్రం న్యూయార్క్ టైమ్స్ పత్రిక మీద పరువునష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం కథనం అంతా అవాస్తవమని, ఆ పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందని ట్రంప్ సీనియర్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జాసన్ మిల్లర్ మండిపడ్డారు.

కాగా, మహిళల ఆరోపణల గురించి తాము ప్రశ్నించిప్పుడు ట్రంప్ చాలా ఆవేశపడ్డారు తప్ప, స్పందించలేదని సదరు పత్రిక ప్రతినిధులు వెల్లడించారు. కాగా, అమెరికా అధ్యక్ష బరిలో మరో అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతుండగా, ట్రంప్ మాత్రం తాను చేసిన వికృత చేష్టలతో వెనకబడిపోతున్నారు.

English summary
Donald J. Trump was emphatic in the second presidential debate: Yes, he had boasted about kissing women without permission and grabbing their genitals. But he had never actually done those things, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X