రష్యా చేతిలో బందీగా 4లక్షల మంది పౌరులు..? డేంజర్‌లో చెర్నోబిల్ అణువిద్యుత్ ఫ్లాంట్ !!.. ఆందోళ‌న‌లో యూర‌ప్

రష్యా చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వైపు కాల్పుల విరమణ ప్రకటించి.. బాంబులతో దాడులకు దిగుతుందని మండిపడింది. శాంతి చర్చలు జరుగుతుండగానే క్షిపణులతో విరుచుకుపడుతోందని దుయ్యబట్టింది. రష్యా దురాక్రమణలకు అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సుమీలో బాంబులతో దాడితో 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Recommended Video

    Russia Ukraine Conflict : I'm Not Hiding In A Bunker Like Putin - Zelenskyy | Oneindia Telugu
    మరియూపోల్‌లో 4లక్షల మంది పౌరులు బందీ

    మరియూపోల్‌లో 4లక్షల మంది పౌరులు బందీ


    రష్యా అనాగరిక దాడులను ఆపాలంటూ ప్రపంచానికి ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. కాల్పుల విరమణ ప్రాంతాల నుంచి ప్రజల తరలింపును అడ్డుకుంటోందని విమర్శించింది. మరియూపోల్‌లో సుమారు 4లక్షల మంది పౌరులు రష్యా బందీలుగా చేసుకుందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా ఆరోపించారు. సుమారు 3వేల మందికి పైగా శిశివులకు ఆహారం, మందులు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మానవతా సాయం, తరలింపును అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులపై విచక్షణా రహితంగా కాల్పులకు దిగుతోందని దిమిత్రి కులేబా విరుచుకుపడ్డారు.

    2డెంజ‌ర్‌లో అణువిద్యుత్ కేంద్రం

    2డెంజ‌ర్‌లో అణువిద్యుత్ కేంద్రం


    మరోవైపు రష్యా సేనలు చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఈ అణువిద్యుత్ కేంద్రం పవర్ గ్రీడ్ నుంచి సంబంధాలు కోల్పోయినట్లు తెలిపింది. ఈ పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్ పంపిణీ నిలచిపోయిందని పేర్కొంది. తక్షణమే ప్రపంచ దేశాలు దీనిపై స్పందించాలని కోరింది. రష్యా కాల్పులు విరమింపజేసేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.

     ప్ర‌మాదంలో యావ‌త్ యూర‌ప్

    ప్ర‌మాదంలో యావ‌త్ యూర‌ప్


    రష్యా అధ్యక్షుడు పుతిన్ దుర్మార్గపు చర్యలతో యావత్ యూరప్‌నే ప్రమాదంలో పడేసిందంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కుబేలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అణువిద్యుత్ కేంద్రం పవవ్ గ్రిడ్ నుంచి విద్యుత్ పంపిణీని పునరుద్ధరించడంతో పాటు ధ్వంసమైన యూనిట్‌లను బాగుచేయాల్సిన అవసరం ఉందన్నారు .. అణు ఇంధనం కోసం ఏర్పాటు చేసిన కూలింగ్ వ్యవస్థలు ఆగిపోతే రేడియేషన్ వెలువడే ప్రమాదం ఉందని కుబేలా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+