శవాల దిబ్బగా మరియుపోల్ : రష్యా దాడుల్లో 5వేల మంది మృతి.. 40 శాతం భవనాలు ధ్వంసం
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్, మరియుపోల్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. మిస్సైల్స్, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. గత నెల రోజుల నుంచి బాంబులతో విరుచుకుపడుతున్నా.. రష్యా బలగాలు పూర్తి స్థాయిలో పట్టుసాధించకలేకపోతున్నాయి. ఒకవైపు చర్చలు అంటూనే మరో వైపు బాంబుల వర్షం కురిపిస్తోంది. పౌరుల తరలింపును కూడా మాస్కో సేనలు అడ్డుకుంటున్నాయని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరియుపోల్‌లో విధ్వంసం
మరి ముఖ్యంగా మరియుపోల్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. రష్యన్ దళాల వరుస దాడులతో మరియుపోల్ దెయ్యాల పట్టణంగా మారింది. దాదాపు 90 శాంతం భవనాలు దెబ్బతిన్నాయని మరియుపోల్ మేయర్ పేర్కొన్నారు. మాస్కో సేనల క్షిపణులు, మిస్సైల్స్ దాడులకు 40శాతం భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పట్టణం నుంచి ఇప్పటివరకు సుమారు 1.4 లక్షల మంది నివాసితులు తప్పించుకోగలిగారు. ఇంకా 1.7లక్షల మంది పౌరులు నగరంలో చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రష్యా దాడులకు 5వేల మంది మృతి
రష్యా దళాల దాడులతో మరియుపోల్ సర్వం కోల్పోయింది. మాతనవతా సంక్షోభవం కారణంగా సుమారు 5 వేల మంది మరణించి ఉంటారని ఉక్రెయిన్ పేర్కొంది. మాస్కో సృష్టిస్తోన్న విధ్వంసం అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరియుపోల్‌లో రష్యా సేనలు యుద్ధనేరాలకు పాల్పడుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆరోపించింది.
పౌరులే లక్ష్యంగా దాడులుకు పాల్పడుతున్న రష్యా దళాలు అక్కడున్నవారిని తరలింపును కూడా అడ్డుకోంటుందని పేర్కొంది.. మరోవైపు రష్యాకు చెందిన ప్రైవేటు మిలటరీ కంపెనీ వాగ్నర్ తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో మోహరించినట్లు బ్రిటిష్ సైనిక నిఘా విభాగం తెలిపింది. వారితో పాటు వేయి మందికి పైగా కిరాయి సేనలను కూడా మోహరించినట్లు వెల్లడించింది..

ఖార్కివ్ క్షిపణులతో దాడులు
మరోవైపు ఖార్కివ్ ప్రాంతంలో రష్యా దాడులను తీవ్రతరం చేసింది. లైబొతిన్ పట్టణంపై రాకెట్ క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడులకు అనేక ఇళ్లు ధ్వంసమైయ్యాయి. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మృతిచెందారు. పశ్చిమ ఉక్రెయిన్‌లో ఓ చమురు డిపోపై రష్యా సేనలు క్షిపణులతో దాడులు చేశాయి. ఈ ప్రాంతంలో రెండో సారి క్షిపణులతో దాడిచేయడమని రివిన్ ప్రాంత గవర్నర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications