ఉక్రెయిన్ కు నాటో దేశాల షాక్ - అభ్యర్ధన తిరస్కరణ : జెలెన్ స్కీ అసహనం..!!
ఉక్రెయిన్ పైన రష్యా బలగాలు విరుచుకు పడుతున్నాయి. రష్యా వైమానిక దళం ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దాడుల ధాటికి పలు భవనాలు శిథిలమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దాడులను అడ్డుకునేందుకు తమ దేశాన్ని 'నో-ఫ్లై జోన్'గా ప్రకటించాలని నాటో దేశాలను అభ్యర్థించారు. అయితే, అనూహ్యంగా నాటో దేశాలు ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నా..ఈ అభ్యర్ధన విషయంలో మాత్రం నో చెప్పాయి. 'నో-ఫ్లై జోన్' విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి.

ఉక్రెయిన్ అభ్యర్ధనకు నో
బస్సెల్స్‌లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్ బర్గ్ వెల్లడించారు. నో-ఫ్లై జోన్ విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌లోకి పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే, రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో -ఫ్లైజోన్ విధించాల్సి ఉంటుందని తెలుపుతూ.. అలా చేస్తే.. యూరోప్‌లో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేపినట్టేననే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందని నాటో దేశాల అభిప్రాయంగా వెల్లడించారు.

బాంబింగ్ కు గ్రీన్ లైట్ ఇవ్వటమే
అయితే, దీని పైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అసహనం వ్యక్తం చేసారు. ఈ నిర్ణయం ద్వారా మరింగ బాంబింగ్ జరిగే అవకాశం ఉందని వాపోయారు. యిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులెబా కీవ్ నుంచి మాట్లాడుతూ.. తమ దేవంలో ఉద్రిక్తతలు చేయిదాటకముందే తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్‌ను మరో సిరియాగా మార్చవద్దంటూ అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తమ సైన్యం పోరాటం మాత్రమ ఆపేది లేదని.. ప్రతి దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు.

మరోసారి ఐక్యరాజ్య సమితిలో
తాజాగా..ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుందని దౌత్యవేత్తలు తెలిపారు. ఈ సెషన్ తర్వాత కౌన్సిల్‌లోని 15 మంది సభ్యులు ముసాయిదా తీర్మానంపై చర్చించనున్నారు. ఈ రెండో సమావేశాన్ని మెక్సికో, ఫ్రాన్స్ ప్రతిపాదించాయని.. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగింపు పలికేందుకు చర్చలు జరపనున్నారు.












Click it and Unblock the Notifications