అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన బాన్ కీ మూన్
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తి అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. కలాం మృతిపై ఐక్యరాజ్య సమితి సిగ్నేచర్ బుక్‌లో బాన్ కీ మూన్ సంతకం చేసి శనివారం నివాళులర్పించారు.
ఆయన మరణానంతరం ప్రపంచ వ్యాప్తంగా విచారం వ్యక్తమవడం కలాంకు దక్కిన గౌరవానికి నిదర్శమని అన్నారు. ఎందరో ప్రజలకు కలాం ఆదర్శంగా నిలిచారని, భారత్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఎంతోమందిలో ఆయన స్పూర్తి నింపారని పేర్కొన్నారు.

భారత ప్రజలతో పాటు తాము కూడా ఒక గొప్ప రాజనీతజ్ఞుడుకి నివాళులర్పిస్తున్నాని తెలిపారు. ఆయన ఆత్మకు నిత్యం శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తన సందేశంలో తెలిపారు. న్యూయార్క్‌లోని భారత పర్మినెంట్ మిషన్‌ను ప్రత్యేకంగా సందర్శించి, దేశ ప్రజలకు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.
కలాం జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications